Prabhas: సాధారణంగా హీరోలు, హీరోయిన్లు వేసుకున్న డ్రెస్ ల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. వారు వేసుకున్నలాంటి షర్ట్ లు, షూస్ తాము కూడా వేసుకోవాలని అభిమానులు ముచ్చటపడుతూ ఉంటారు. కానీ, వారు వేసుకొనే ఒక్కో షర్ట్ ధర చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇక టాలీవుడ్ లో బ్రాండ్స్ కు పెట్టింది పేరు ఎన్టీఆర్. టీ షర్ట్స్, షర్ట్స్, షూస్ ఇలా ప్రతిదీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వాడుతూ ఉంటాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ వాడే వాచెస్ అయితే కొన్ని కోట్లు ఉంటాయని టాక్. ఇక అల్లు అర్జున్ గురించి అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. ఐకాన్ స్టార్ ఐకానిక్ ఫ్యాషన్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. వీరందరిని పక్కన పెడితే డార్లింగ్ ప్రభాస్ చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉంటాడు. బయటికి ఎక్కడికి వచ్చినా ఒక బ్లాక్ కలర్ టీ షర్ట్, ఒక క్యాప్ పెట్టుకొని కనిపిస్తూ ఉంటాడు. ఇక నిన్న జరిగిన సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అలాగే తళుక్కున మెరిశాడు. బ్లూ కలర్ టీ షర్ట్ మరియు బ్లూ జీన్స్, బ్లాక్ క్యాప్ తో స్టైలిష్ గా కనిపించాడు.
ఇక దీంతో ప్రస్తుతం ప్రభాస్ టీ షర్ట్ గురించిన చర్చ నెట్టింట వైరల్ గా సాగుతోంది. మన ప్రభాస్ రేంజ్ కు తగ్గ షర్ట్ యేనా..? ఎంత ఉంటుంది అంటూ అభిమానులు ఈ టీ షర్ట్ గురించి ఆరా తీసి అవాక్కయ్యారు. అవును టీ షర్ట్ ఫేమస్ బ్రాండ్ డాల్స్ గబ్బానా డిజైన్ చేసింది. దాని విలువ అక్షరాలా రూ.20 వేలు. చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తుంది.. ఎంత ఉంటుందిలే.. మనం కూడా ఒకటి తీసుకుందామని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా సెర్చ్ చేసి డీలా పడ్డారు. ఓరి బాబో ఒక్క టీ షర్ట్.. రూ.20 వేలు ఏంటిరా బాబు అంటూ నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఇక మరోపక్క అబ్బే మరీ చీప్.. పాన్ ఇండియా స్టార్.. ఇక కాస్ట్లీ గా డ్రెస్ వేసుకోవాలి అంటూ చెప్పుకోస్తున్నారు. ఇక మొన్నటికి మొన్న బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ధరించిన టీ షర్ట్ విలువ రూ.24 వేలు. ఇలా చెప్పుకొంటూ పోతే మన స్టార్లు రేంజ్ మాములుగా ఉండదు అంటున్నారు నెటిజన్లు.