Prabhas: డార్లింగ్ ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. రాజు ఎక్కడైనా రాజే అన్న చందనా.. డార్లింగ్ ఎక్కడున్నా అక్కడ విందు భోజనాలే.. ఇక తాజాగా ప్రభాస్ అన్ స్టాపబుల్ 2 లో బాలయ్యతో కలిసి సందడి చేసిన విషయం తెల్సిందే. తన బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్ తో కలిసి ప్రభాస్ సెట్ లో అడుగుపెట్టాడు. నిన్న ఈ ఎపిసోడ్ షూటింగ్ జరుగగా.. సెట్ మొత్తానికి ప్రభాస్ విందు భోజనాలు వండించాడు. ముఖ్యంగా బాలయ్యకు ఇష్టమైన వంటకాలను ఇంటి నుంచి వండించి సెట్ కు తీసుకొచ్చాడు.
చేపల పులుసు,మటన్ కర్రీ, చికెన్, పీతల ఇగురు తో పాటు పప్పు, ఆవకాయ్, సాంబార్ లాంటి వెజ్ ఐటమ్స్ ను కూడా తీసుకొచ్చాడట. ఇక వీటిని చూసిన బాలయ్య కడుపారా ఆరగించి ప్రభాస్ కు థాంక్స్ చెప్పినట్లు సమాచారం. ఏదిఏమైనా ప్రభాస్ ఆతిథ్యం అంటే ఆతిథ్యమే. ఈ విషయం తెలియడంతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రభాస్ ను ప్రశంసిస్తున్నారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. మరి ఫుడ్ తో బాలయ్య ను మెప్పించిన ప్రభాస్.. సమాధానాలతో మెప్పించాడా..? లేదా అనేది చూడాలి.