Prabhas: సోషల్ మీడియా వచ్చాకా ఎప్పుడు ఏ వార్తను ట్రెండ్ చేస్తారో అర్థంకాకుండా పోతోంది. సమయం, సందర్భం లేకుండా రూమర్స్ పుట్టించడం వలన సదురు సెలబ్రిటీస్ ఎంత బాధపడతారో తెలుసా అని అభిమానులు ట్రోలర్స్ పై విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అసలు విషయం ఏంటంటే.. ప్రభాస్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తో ప్రేమలో ఉన్నాడని, గత కొన్ని రోజుల నుంచి వీరి మధ్య ఎఫైర్ ఉందని వార్తలు గుప్పుమన్నాయి.వీరిద్దరు కలిసి ఆది పురుష్ అనే సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎలా జరిగింది..? ప్రభాస్ తో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉందని కృతి ని అడిగినప్పుడు ఆమె ప్రభాస్ డార్లింగ్.. ఆయనతో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చింది.
ప్రభాస్ సైతం సీత పాత్రలో కృతి అద్భుతంగా నటించిందని చెప్పుకొచ్చాడు. అయితే ఇది జరిగి చాలా రోజులు అయ్యింది. కానీ గత రెండు రోజులుగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఉందంటూ వార్తలు రావడం విశేషం. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం ప్రభాస్ పెద్ద తండ్రి కృష్ణంరాజు మృతి చెందిన బాధలో ఉన్నాడు. కుటుంబాన్ని చూసుకోవడానికి షూటింగ్స్ కూడా మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు. ఇలాంటి సమయంలో ఈ రూమర్స్ చాలా బాధాకరమని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. కొద్దిగా ప్రభాస్ ను, ఆయన కుటుంబాన్ని ప్రశాంతంగా వదిలేయాలని ట్రోలర్స్ ను ప్రభాస్ ఫ్యాన్స్ వేడుకుంటున్నారు. ఇంకా మరికొందరు మాత్రం ప్రభాస్ ఎలాంటివాడో అందరికి తెలుసు.. మేము అస్సలు నమ్మం అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే ఎవరో ఒకరు రియాక్ట్ అయ్యేవరకు ఆగాల్సిందే.