బాహుబలి సిరీస్‌తో పాన్ ఇండియా హీరోగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు రెబల్ స్టార్ ‘ప్రభాస్’. ప్రస్తుతం ఆయనతో సినిమా చేయాలంటే.. కనీసం 500 కోట్ల బడ్జెట్ పెట్టాల్సిందే. ఇక ‘ప్రభాస్’ తర్వాత టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను రూల్ చేసిన హీరోగా ‘అల్లు అర్జున్’ నిలిచాడు. ‘పుష్ప2’ సినిమాతో ఏకంగా బాహుబలి రికార్డ్‌ను సైతం బ్రేక్ చేసి సంచలనం సృష్టించాడు. ప్రస్తుతానికి ఈ ఇద్దరు పాన్ ఇండియా స్టార్ డమ్‌ను పీక్స్‌లో అనుభవిస్తున్నారు. అలాంటి ఈ ఇద్దరు బిగ్ స్టార్స్.. ఈసారి అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకేసారి ఇద్దరు ట్రిపుల్ రోల్ చేయడానికి రెడీ అవుతున్నారు.
ప్రజెంట్ ఉన్న స్టార్ హీరోలలో ‘జూనియర్ ఎన్టీఆర్’ మాత్రమే ‘జై లవ కుశ’ సినిమాలో ట్రిపుల్ రోల్ చేశాడు. ఇప్పుడు ప్రభాస్, బన్నీ అందుకు సిద్ధమవుతున్నారు. ‘సందీప్ రెడ్డి వంగ’తో ప్రభాస్ చేయబోతున్న ‘స్పిరిట్’ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనించబోతున్నాడు. అలాగే.. లవర్ బాయ్ పాత్రతో పాటు గ్యాంగ్‌స్టర్‌గా కూడా నటించనున్నాడట. మరోవైపు.. ‘పుష్ప2’ తర్వాత అట్లీతో భారీ విజువల్ వండర్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో ఆయన త్రిపాత్రభినయం చేయబోతున్నాడట. బన్నీ డ్యూయెల్ రోల్, ట్రిపుల్ రోల్ చేయడం ఇదే ఫస్ట్ టైం. దీంతో.. ఈ రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లకముందే భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
Also Read: Wives Killing Husbands : భర్తలను చంపేస్తున్న భార్యలు.. ఇది కొత్త ట్రెండా?
ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే? ఈ రెండు సినిమాల్లోను బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనేను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ దీపిక పెట్టిన కండీషన్ సందీప్‌కు నచ్చలేదు. దీంతో.. స్పిరిట్‌లో ‘అనిమల్’ హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రిని తీసుకున్నాడు. కానీ.. బన్నీ, అట్లీ ప్రాజెక్ట్‌లో మాత్రం దీపిక ఫైనల్ అయింది. రీసెంట్‌గానే సూపర్ ఉమెన్ అన్నట్టుగా ఒక వీడియోతో ఈ విషయాన్నిఅనౌన్స్ చేశారు మేకర్స్. ఏదేమైనా.. ప్రభాస్, అల్లు అర్జున్ మాత్రం నెక్స్ట్ లెవల్ ప్లానింగ్‌లో ఉన్నారనే చెప్పాలి.