ఇప్పటి వరకు ఆదిపురుష్ నుంచి కేవలం ఒక టీజర్, ఒక ట్రైలర్, రెండు సాంగ్స్ బయటికొచ్చాయి. ప్రమోషన్స్ కి కిక్ స్టార్ట్ చేస్తూ స్టార్టింగ్‌లో వచ్చిన టీజర్ ఆదిపురుష్ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసేసింది. ట్రోలింగ్ ఫేస్ చేసే రేంజులో టీజర్ ఇంపాక్ట్ ఇచ్చింది. ఇక్కడి నుంచి బయటకి వచ్చి ఆదిపురుష్ విజువల్స్ ఎఫెక్ట్స్ కి కరెక్షన్స్ చేసాడు ఓం రౌత్. ఆ తర్వాత దాదాపు ఆరు నెలలకి మళ్లీ ఆదిపురుష్ ప్రమోషన్స్ కి స్టార్ట్ చేసారు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయినా ట్రైలర్, జై శ్రీరామ్ సాంగ్, రామ్ సీతా రామ్ సాంగ్స్ ‘ఆదిపురుష్’ సినిమాపై హైప్‌ని డబుల్ చేసేశాయి. ప్రీరిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. జై శ్రీరామ్ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి సినీ అభిమానులు భక్తులుగా మారిపోయి పరవశంలో తేలిపోతున్నారు. దీంతో జూన్ 16న థియేటర్లన్ని రామ మందిరాలుగా మారడం ఖాయమంటున్నారు. మరో వైపు ట్రేడ్ వర్గాలు ఈ సినిమా ఓపెనింగ్స్, వసూళ్ల గురించి లెక్కలు వేసుకుంటున్నారు. ట్రేడ్, మూవీ లవర్స్, క్రిటిక్స్… ఇలా అందరి దృష్టి ఇప్పుడు ఆదిపురుష్ పైనే ఉన్నాయి.
ఎంత హైప్ ఉన్నా దాన్ని మరింత పెంచుతూ… ఆదిపురుష్ పై మరింత బజ్ ని క్రియేట్ చేయడానికి మేకర్స్ మరింత ప్లాన్ చేస్తున్నారు. అందుకే గ్రాండ్ గా జూన్ 6న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తిరుపతిలో గ్రాండ్ నిర్వహించనున్నారు. వెంకటేశ్వర యూనివర్సిటీ మైదానంలో ఈ ఈవెంట్ భారీ ఎత్తున జరగబోతోంది. దర్శక ధీరుడు రాజమౌళి ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్‌గా వచ్చే ఛాన్స్ ఉంది. అయితే రిలీజ్ డేట్ వరకూ ఆదిపురుష్ నుంచి మరిన్ని సాలిడ్ అప్డేట్స్ ఇస్తూనే ఉండేందుకు ఓం రౌత్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో సెకండ్ ట్రైలర్‌ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రీరిలీజ్ ఈవెంట్ రోజునే కొత్త ట్రైలర్ లాంచ్ చేసి.. సినిమా పై మరింత హైప్ తీసుకురావాలని అనుకుంటున్నారట. ఒకవేళ సినిమా రిలీజ్‌కి కొన్ని రోజుల ముందు కొత్త ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. మరి ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.