వాల్మీకీ రాసిన రామాయణ గాధని చదవని, వినని, తెలియని వాళ్లు ఉండరు. సీతా దేవి శ్రీరాముల వారి కథని తరతరాలుగా వింటూనే ఉన్నాం. మహోన్నత ఈ గాధపై ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు వచ్చాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు శ్రీరాముని పాత్రలో అద్భుతాలే చేసాడు. ఈ జనరేషన్ లో బాలకృష్ణ ‘రామావతారం’ ఎత్తాడు. యంగ్ హీరోల్లో ఇప్పుడు ఆ అదృష్టం ప్రభాస్ కి దక్కింది. దర్శకుడు ఓం రౌత్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని పెట్టి ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జట్ తో రూపొందిన ఈ సినిమా జూన్ 16న ఆడియన్స్ ముందుకి రానుంది. ఆదిపురుష్ నుంచి వచ్చిన ట్రైలర్ స్ రెండూ సాలిడ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకోవడంతో సినిమాపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. ఇటీవలే జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ కి లక్ష మంది ప్రేక్షకులు అటెండ్ అయ్యారు అంటే ఆదిపురుష్ సినిమాపై అంచనాలు ఏ రేంజులో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. అయితే సినీ అభిమానులందరిలోనూ “అసలు ఈ కథని ఓం రౌత్ ఎక్కడి నుంచి మొదలుపెడతాడు? సీతా స్వయంవరం నుంచా? తాటక వధ నుంచా? అసలు ఎక్కడి నుంచి ఎంతవరకు తెరపై చూడబోతున్నాం” అనే అనుమానం ఉంది. ఈ ప్రశ్నకి సమాధానం దొరికేసింది.
సీతాదేవి, శ్రీ రాముడు, లక్ష్మణుడు వనవాసం పయనం అయ్యే దగ్గర ఆదిపురుష్ సినిమా మొదలై… సూర్ఫణఖ వచ్చి చెవులు ముక్కు కోపించుకోని వెళ్లే దగ్గర నుంచి పేస్ ఎత్తుకోనుంది. ఆ తర్వాత రావణుడు వచ్చి సీతాదేవిని అపహరించి తీసుకోని వెళ్లడం, హనుమంతుడు-రాముడి పరిచయం, సముద్రంపై వంతెన నిర్మిచడం, లంకా దహనం, అంతిమ యుద్ధం, సీతాదేవి రాముల వారు తిరిగి అయోధ్య చేరడంలో ఆదిపురుష్ సినిమా ముగుస్తుంది. రామాయణం మొత్తం తీసుకోకుండా ఓం రౌత్ తెలివిగా ఎక్కడి నుంచైతే రామాయణంలో మలుపు మొదలవుతుందో అక్కడి నుంచే తీసుకోని, త్వరగా యుద్ధకాండ లోకి వెళ్లిపోయాడు. ఆదిపురుష్ చిత్ర యూనిట్ సెన్సార్షిప్ కోసం అప్ప్లై చేసిన దాంట్లో ప్లాట్ సమ్మరీ అని ఈ విషయాన్ని రివీల్ చేసారు. ఇదే కాదు ఆదిపురుష్ నిడివి కూడా 179 నిముషాలుగా తెలిసింది. అంటే నిమిషం తక్కువ మూడు గంటలు అనమాట. మరి ఈ మూడు గంటల సినిమాని పాన్ ఇండియా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి.
#Xclusiv… ‘ADIPURUSH’ *HINDI* RUN TIME… #Adipurush HINDI certified ‘U’ by #CBFC on 8 June 2023. Duration: 179.00 min:sec [2 hours, 59 min, 00 sec]. #India
⭐ Theatrical release date: 16 June 2023.#Prabhas #KritiSanon #SaifAliKhan #SunnySingh #DevdattaNage pic.twitter.com/40SavtWUyX
— taran adarsh (@taran_adarsh) June 8, 2023