పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాతో తన క్రౌడ్ పుల్లింగ్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తున్నాడు. నెగటివ్ టాక్, యావరేజ్ టాక్ అనే మాటలతో కూడా సంబంధం లేకుండా ఇండియన్ బాక్సాఫీస్ ని కుదిపేస్తున్నాడు. మొదటి రోజు 140 కోట్లు రాబట్టి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన ఆదిపురుష్, రెండో రోజు కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టింది. ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యే రెంజులో సెకండ్ డే కూడా 100 కోట్లు రాబట్టడం ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాకి నిదర్శనం. ఈరోజు ఆదివారం కావడం, బుకింగ్స్ సాలిడ్ గా ఉండడం చూస్తుంటే ఆదిపురుష్ సినిమా మూడో రోజు కూడా వంద కోట్ల మార్క్ ని టచ్ చేసేలా కనిపిస్తోంది. మొదటి మూడు రోజుల్లోనే ఆదిపురుష్ సినిమా 350 కోట్లని రాబట్టి థియేట్రికల్ బిజినెస్ లో దాదాపు 60%ని రికవర్ చేసేలా కనిపిస్తోంది. బుకింగ్స్ ని ఇలానే హోల్డ్ చేస్తే చాలు ఆదిపురుష్ సినిమా వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదు. అదే జరిగితే ప్రభాస్ ఒక యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాతో కూడా 500 కోట్లకి పైగా రాబట్టిన ఏకైక హీరోగా హిస్టరీ క్రియేట్ చేస్తాడు.
Read Also: Spy Release Date: నిఖిల్ చేత కూడా చెప్పించేశారు.. 29నే వరల్డ్ వైడ్ రిలీజ్