Prabhas: మరో వివాదంలో ‘ఆదిపురుష్’… కోర్ట్ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యాక్షన్ మోడ్ నుంచి మైథాలజీ జోనర్ లోకి వెళ్లి చేస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ‘రామాయణం’ ఆధారంగా రూపొందుతుంది. సైఫ్ అలీ ఖాన్ ‘రావణ’గా, కృతి సనన్ ‘సీత’గా నటిస్తున్న ఈ ఆదిపురుష్ మూవీని ఏ టైంలో అనౌన్స్ చేశారో తెలియదు కానీ అప్పటినుంచి ఈ సినిమా ఎదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంది. హనుమంతుడి గెటప్, రావణ హెయిర్ స్టైల్, ప్రభాస్ వేషధారణ, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా ఎదో ఒక విషయంలో ఆదిపురుష్ సినిమా విమర్శలు, వివాదాలతో గడిపేస్తుంది. అన్ని బాగుంటే నిన్న విడుదల అయ్యి ఈపాటికి రిజల్ట్ తేలిపోవాల్సిన ఈ మూవీని పోస్ట్ ప్రొడక్షన్ లో క్వాలిటీ పెంచడం కోసం వాయిదా వేశారు. విజువల్ ఎఫెక్ట్స్ పై నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తుండడంతో మేకర్స్ ఆదిపురుష్ మూవీని పోస్ట్ పోన్ చేశారు.
Read Also: Vaarasudu Review: వారసుడు మూవీ రివ్యూ (తమిళ డబ్బింగ్)
Also Read
- KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అసలు ఆదిపురుష్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే క్లారిటీ లేకనే ప్రభాస్ ఫాన్స్ తలపట్టుకోని కూర్చుంటూ ఉంటే, తాజాగా ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. సెన్సార్ బోర్డ్ నుండి సర్టిఫికేట్ పొందకుండానే చిత్ర నిర్మాతలు ఆదిపురుష్ సినిమా ప్రోమోను విడుదల చేశారని, ఇది నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని పిటిషన్‌లో కుల్దీప్ తివారీ అనే వ్యక్తి పేర్కొన్నారు. సినిమాలో సీతా దేవి పాత్రను పోషిస్తున్న కృతి సనన్ దుస్తులపైనా కూడా పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశాడు కులదీప్. పిల్ ను విచారణకు స్వీకరించిన కోర్టు సెన్సార్ బోర్డుకు నోటీసులు పంపింది. అలహాబాద్ హైకోర్టు ప్రభాస్ సినిమాపై పిల్‌పై సమాధానం ఇవ్వమని సెన్సార్ బోర్డుని కోరింది. మరి ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
-
Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
-
MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
ట్రెండింగ్
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!