అనౌన్స్మెంట్ నుంచే పవర్ స్టార్ నటిస్తున్న OG సినిమాని నెక్స్ట్ లెవల్ అనేలా ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం పవన్ నాలుగు సినిమాలు చేస్తున్నాడు కానీ OG సినిమాకి ఉన్న హైప్, ఈ సినిమాపై ఉన్న అంచనాలు, ఈ సినిమా క్రియేట్ చేస్తున్న బజ్ మరో సినిమా చెయ్యట్లేదు. OG సినిమా కోసమే ఈగర్లీ వెయిటింగ్ అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఒక పవర్ స్టార్ అభిమానిగా డైరెక్టర్ సుజీత్… పవన్ కి ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తాడు అని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ కూడా తగ్గేదేలే అంటూ OG గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఫాన్స్ కి ఫుల్ జోష్ లో ఉంచుతుంది. పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా, ముంబై బ్యాక్ డ్రాప్లో వస్తున్న సినిమా కావడంతో OG సినిమాని పంజా మూవీతో పోల్చి చూస్తున్నారు పవన్ ఫాన్స్. రీసెంట్‌గానే ఈ సినిమా షూటింగ్ ముంబైలో స్టార్ట్ అయింది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇదే స్పీడ్‌లో OG రిలీజ్ కూడా ఉంటుందనే… ఆలోచనలో ఉన్నారు పవన్ ఫ్యాన్స్ కానీ లేటెస్ట్గా ఓ రూమర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: Pawan Kalyan: ఆయన ఊరికే అలా నిలబడినా చాలు.. ట్విట్టర్ షేక్ అయిపోతుంది
ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌ను ఈ ఏడాది లేదా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేయడం పక్కా అని ఫాన్స్ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా 2025 సంక్రాంతికి OG మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, వినోదయ సీతమ్ రీమేక్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఒక్కో సినిమాకు గ్యాప్ ఉండేలా.. OG రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఇదే జరిగితే పవన్ ఫాన్స్ OG కోసం మరో ఏడాదిన్నరకు పైగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పవన్ ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అవుతున్నారు. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కోసం రెండేళ్లు వెయిట్ చేయడం అంటే.. చాలా కష్టం అంటున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఓజి మేకర్స్‌ను అడుగుతున్నారు. మరి దీనిపై డివివి సంస్థ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.