ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల అప్డేట్స్ ఒకే రోజు వస్తే ఇంకేమైనా ఉంటుందా? సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. పవర్ స్టార్ ఆర్మీ చేసే యుద్ధానికి సర్వర్లు క్రాష్ అయిపోతాయి. ఇప్పుడదే జరగబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాలు ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లు పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ మాఫియా బ్యాక్ డ్రాప్‌లో రాబోతోంది. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ వస్తోంది. ఈ మూడు సినిమాల పై భారీ అంచనాలున్నాయి. అయితే ఓజి, ఉస్తాద్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంటే… హరిహర వీరమల్లు మాత్రం డిలే అవుతూ వస్తోంది.
Get ready to face the HEAT WAVE!! 🔥🔥🔥#FireStormIsComing on September 2nd. 🤙🏻🤙🏻🤙🏻#OG fans, brace yourselves… #TheyCallHimOG 💥💥 pic.twitter.com/dB8G7ihCxY
— DVV Entertainment (@DVVMovies) August 10, 2023
ఎంత డిలే అవుతున్నా కూడా ఎట్టిపరిస్థితుల్లోను ఎలక్షన్స్ లోపు పవన్ ఈ సినిమాలను కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. అంతేకాదు ఒకేరోజు ఈ సినిమాల నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా.. సెప్టెంబర్ 2 ఈ సినిమాల నుంచి బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయాన్ని నిజం చేస్తూ OG నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ముంబై తాజ్ హోటల్ ముందు అయిదు మంది మనుషులతో పవన్ కళ్యాణ్ గన్ పట్టుకోని నడుస్తున్న బ్యాక్ స్టిల్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ ఫ్రంట్ వెర్షన్ రిలీజ్ చేసి ఉంటే ఈ పాటికి సోషల్ మీడియా స్తంభించేది. బ్లడ్ ఫ్లో డెన్సిటీ అంటూ సుజిత్ ఎదో పెద్దగానే ప్లాన్ చేసాడు. మరి సెప్టెంబర్ 2న టీజర్ రిలీజ్ అవుతుందా లేక జస్ట్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. OGతో పాటు ఉస్తాద్ భగత్ అండ్ హరిహర వీరమల్లు నుంచి కూడా అప్డేట్స్ బయటకి రానున్నాయి. ఈ మూడు సినిమాల అప్డేట్స్ అన్ని ఒకేరోజు బయటికొస్తే ఏది బాగుందనే కంపారిజన్స్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి సెప్టెంబర్ 2న సోషల్ మీడియాలో పవన్ వర్సెస్ పవన్‌గా మారుతుందని చెప్పొచ్చు. ఏదేమైనా పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు మాత్రం పండగేనని చెప్పొచ్చు.