సోషల్ మీడియా గత కొన్ని రోజులుగా ప్రభాస్ ఫాన్స్ హ్యాండ్ ఓవర్ లో ఉంది. ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ ముందు రోజు నుంచి నిన్నటి వరకూ ట్విట్టర్ ని షేక్ చేసే పనిలోనే ఉన్నారు ప్రభాస్ ఫాన్స్. ఇప్పుడు ప్రభాస్ ఫాన్స్ నుంచి ట్విట్టర్ అండ్ ఇన్స్టాని టేకోవర్ చేసుకున్నారు పవర్ స్టార్ ఫాన్స్. హరీష్ శంకర్ దర్శకత్వంలో, గబ్బర్ సింగ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్ప్స్ ని ఈరోజు సాయంత్రం సంధ్య 70MM థియేటర్ లో ఈవెంట్ చేసి రిలీజ్ చెయ్యనున్నారు. ఈ ఫస్ట్ గ్లిమ్ప్స్ అనౌన్స్మెంట్ ఎప్పుడైతే అఫీషియల్ గా బయటకి వచ్చిందో అప్పటి నుంచి పవన్ ఫాన్స్ సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్, పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ అనే టాగ్స్ ని క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు.
ట్విట్టర్ లో హంగామా అంతా ఉస్తాద్ భగత్ సింగ్ గురించే కావడం విశేషం. గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయ్యి 11 ఏళ్లు అయిన సంధర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి హరీష్ శంకర్ అండ్ టీం ఉస్తాద్ ఫస్ట్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ గ్లిమ్ప్స్ తోనే పవన్ తో తన కాంబినేషన్ ఎలా ఉంటుందో శాంపిల్ చూపించడానికి దేవి శ్రీ ప్రసాద్ కూడా రెడీ అయ్యాడు. మరి హరీష్ శంకర్, దేవి శ్రీ ప్రసాద్, పవన్ కళ్యాణ్ లు కలిసి గబ్బర్ సింగ్ రేంజ్ ఇంపాక్ట్ ని జస్ట్ ఉస్తాద్ భగత్ ఫస్ట్ గ్లిమ్ప్స్ తోనే క్రియేట్ చేస్తారా లేదా అనేది చూడాలి.