జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలకు నటుడు పోసాని కృష్ణ మురళీ కౌంటర్ ఇచ్చారు. నిజంగా పవర్ స్టార్ అయితే ఓ అమ్మాయికి న్యాయం చేయ్.. అంటూ, పంజాబీ అమ్మాయి అంటూ పరోక్షంగా పూనమ్ కౌర్ విషయాన్ని మధ్యలోకి పోసాని లాగేశాడు.
పోసాని కృష్ణ మురళీ మాట్లాడుతూ.. ‘నాకు చిన్నప్పటి నుంచి ప్రశ్నించే గుణం వుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు. అప్పుడు ప్రశ్నిస్తానని అన్నారు తప్పు లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ తనే ప్రశ్నిస్తాడు తానే జవాబు చెపుతాడు. జగన్ పార్టీ పెట్టాక ముందు నుంచే నేను జగన్ అభిమానిని.. నేను చచ్చిపోయి వరకు జగన్ అభిమానిగా వుంటాను. పదవులు ఇస్తాము అన్నా నాకు వద్దని అన్నాను.. చిరంజీవి నోటి వెంట ఒక బ్యాడ్ మాట విన్నారా..? మీరు ఎవరిని ప్రేరణగా తీసుకొని బూతులు తిడుతున్నారు.
సాయిధరమ్ తేజ్ తన రెక్కల కష్టంతో పైకి వచ్చాడు. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. పవన్ రిపబ్లిక్ ఫంక్షన్ కి వచ్చి జగన్ నీ మంత్రులను తిట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది..? జగన్ కి కుల పిచ్చి మాత పిచ్చి వుందని నిరూపించగలరా ? జగన్ తన నియోజక వర్గానికి వెళ్ళాక పోయిన అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. రెండు నియోజకవర్గలలో నుంచున్నారు గెలిచారా? అని పోసాని విమర్శలు చేశారు.
ఒక సినిమాలో ఆడవాళ్ళు జోలికొస్తే కళ్ళు పికేస్తా అన్నారు మీరు.. పంజాబ్ నుంచి వచ్చిన ఒక అమ్మాయికి ఇండస్ట్రీలో ఒక ప్రముఖుడు అవకాశాలు ఇస్తానని మోసం చేశాడు. ఆ అమ్మాయిని బలవంతంగా అబార్షన్ చేయించారంట అతను ఒక ప్రముఖ వ్యక్తి.. ఆ ప్రముఖు వ్యక్తి పేరు పవన్ కళ్యాణ్ గారికి చెపుతాను. మీరు ఆ అమ్మాయి తరుపున నిలబడి ఆ ప్రముఖ వ్యక్తి మీద పోరాటం చేస్తే నేను మీకు గుడి కడతాను. ఆ పిల్ల జీవితాన్ని బాగు చేస్తారా..? అప్పుడు మీ ముందు జగన్ కూడా పనికి రాడు సార్.. ఆ అమ్మాయి కి మీరు అండ దండలు అందించకపోతే మీరు ఎవ్వరినీ ప్రశ్నలు అడిగే అర్హత లేదు. పవన్ కళ్యాణ్ అంటే ప్రపంచానికి తెలుసు, ఇండస్ట్రీకి తెలుసు. పవన్.. మీరు జగన్ తో పోల్చకోవద్దు’ అంటూ పోసాని మాట్లాడిన తీరు హాట్ టాపిక్ గా మారింది.