‘ఢీ’ డ్యాన్స్ కార్యక్రమానికి కొన్నాళ్ళు జడ్జిగా వ్యవహరించిన నటి పూర్ణ.. ఉన్నట్టుండి ఆ షో నుంచి తప్పుకుంది. అప్పుడు సరైన కారణమేంటో ఎవరికీ తెలీదు. అనంతరం జబర్దస్త్, మా కామెడీ స్టార్స్‌లో తళుక్కుమనడంతో.. బహుశా ఇటు షిఫ్ట్ అవ్వడం వల్లే ఆ షోకి డేట్స్ కేటాయించలేకపోయిందని అంతా అనుకున్నారు. కానీ.. కారణం అది కాదని, అసలు విషయం వేరే ఉందని ఇన్నాళ్ళ తర్వాత పూర్ణ స్పందించింది. హగ్స్ ఇవ్వలేకే తాను ఆ షో నుంచి తప్పుకున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. డ్యాన్స్ బాగా చేశారని చెప్తే, ఆ డ్యాన్సర్లకు హగ్స్ ఇవ్వాలని.. వారితో పాటు డ్యాన్స్ మాస్టర్స్‌కి, అలాగే యాంకర్స్‌కి కూడా హగ్స్ ఇవ్వాలని.. అది ఇష్టం లేకనే ఢీ షో నుంచి తప్పుకున్నానని క్లారిటీ ఇచ్చింది.
కాగా.. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన పూర్ణ కెరీర్ సవ్యంగా సాగలేదు. నటన పరంగా మెప్పించినా, ఆఫర్లు పెద్దగా రాలేదు. దీంతో, సినిమా ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు కొన్ని టీవీ షోలలో పాల్గొంది. ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కబోతోంది. సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కుటుంబసభ్యుల ఆశీర్వాదంతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నానని పేర్కొంటూ.. కాబోయే భర్తను అభిమానులకు పరిచయం చేసింది. అతని పేరు షానిద్ ఆసిఫ్.. జేబీఎస్ గ్రూఫ్ ఆఫ్ కంపెనీ ఎండీ. ఇన్నాళ్ళూ కెరీర్‌కు మెరుగులు దిద్దుకోవడంలో కాలం గడిపిన పూర్ణ.. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో బిజీ కానుంది.