Poonam Kaur: మాయాజాలం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ పూనమ్ కౌర్. ప్రస్తుతం పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్న పూనమ్ ఒక అరుదైన బారిన పడినట్లు చెప్పుకొచ్చింది. ఫైబ్రో మైయాల్జియా అనే వ్యాధితో పూనమ్ బాధపడుతోంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే.. ఎక్కువగా అలసట, నిద్ర, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసికంగా కుంగిపోయినట్లు అనిపించడం, కండరాల నొప్పి ఉంటాయట. గత రెండేళ్లుగా పూనమ్ ఈ వ్యాధితో బాధపడుతుందని చెప్పుకొచ్చింది.
గత రెండేళ్లుగా ఆమె ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నా ఎటువంటి ప్రయోజనం లేదని, చివరకు కేరళలోని ఆయుర్వేద చికిత్సాలయంలో చికిత్స తీసుకోవడానికి వచ్చినట్లు తెలిపింది. ప్రస్తుతం అక్కడే చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపిన పూనమ్ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి వ్యాయామాలు, టాకింగ్ థెరపీ కూడా చేస్తున్నట్లు చెప్పుకొచ్చిదని. ఈ చికిత్స వలన త్వరలోనే తాను కోలుకొంటాను అనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక ఈ విషయం తెలియడంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.