Ari: ఎలా బతకకూడదో చెప్పబోతున్న అనసూయ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘సోగ్గాడే చిన్ని నాయనా’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన స్టార్ యాంకర్ అనసూయ ‘రంగస్థలం’తో నటిగా తన సత్తాను చాటుకుంది. అలానే మధ్య మధ్యలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ సోలో హీరోయిన్ గానూ సక్సెస్ ను అందుకుంటోంది. తాజాగా ‘అరి’ అనే సినిమాలో ఆమె కీ-రోల్ ప్లే చేసింది. గతంలో ‘పేపర్ బాయ్’ మూవీని తెరకెక్కించిన జయశంకర్ ‘అరి’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రముఖ వ్యాపారవేత్తలు శేషు మారంరెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్వీ రెడ్డి ప్రెజెంటర్. ఈ మూవీ టైటిల్ లోగోను శుక్రవారం హుజూరాబాద్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆవిష్కరించారు. ఈ టైటిల్ లోగో ఆవిష్కరణలో ‘అఖండ’ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సైతం పాలుపంచుకున్నారు. సాయికుమార్, వైవా హర్ష, శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర ప్రాధాన పాత్రలు పోషించిన ‘అరి’ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ, ”నిర్మాతకు కథను చెప్పి వెంటనే ఒప్పించగలిగాను. కానీ ‘అరి’ అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేయించడానికి చాలా కష్టపడ్డాను. ఇది సంస్కృత పదం. అరి అంటే శత్రువు అని అర్థం. అది ఏమిటి? అనేది సినిమాలో చెప్పాను. కె. వి. రెడ్డి గారు ఓ సందర్భంలో, సినిమా తీయడమంటే వంద పెళ్ళిళ్లతో సమానం అన్నారు. కానీ కోవిడ్ వల్ల సినిమా తీయడం వెయ్యి పెళ్ళిళ్ళతో సమానం అని నాకు అనిపిస్తుంది. ఈ సినిమాను 2020లో కరోనా టైంలో చాలా స్ట్రగుల్ ఫేజ్ లో తీశాం. నా తొలి చిత్రం ‘పేపర్‌బాయ్’ కంటే ఈ సినిమాకు మరింత పేరు వస్తుందనే నమ్మకముంది” అని అన్నారు. అనసూయ మాట్లాడుతూ, ”దర్శకుడు కథ చెప్పినప్పుడే చాలా కుతూహలం కలిగింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లో అద్భుతమైన కంటెంట్ తో సినిమాలు వస్తున్నాయి. మనకెందుకు రావని చూసినప్పుడు అనిపించేది. ఈ కథ విన్నాక మనం కూడా తీయగలం అనిపించింది. ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా చేశాక ఇంత పేరు వస్తుందని అనుకోలేదు. ఈ జన్మకు చాలు అన్నట్లు అనిపించింది. ఆ తర్వాత రెండేళ్ళపాటు అవకాశాలు రాలేదు. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. లక్కీగా ఫీలవుతున్నాను. నాకోసం కేరెక్టర్లు రాస్తున్నారు. ‘పుష్ప’ చాలా సంతృప్తినిచ్చింది. రెండో భాగంలో మంచి పాత్ర వుంది. ఈ సినిమాలో హ్యూమానిటీతోపాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా వుంది. ఎలా బతకకూడదనే విషయాన్ని ఎంటర్‌టైన్‌గా దర్శకుడు చూపించారు” అని చెప్పారు.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
”మనిషి ఎలా బతకాలో ఇంతకు ముందు సినిమాలు చూపించాయి. కానీ మా సినిమా మనిషి ఎలా బతకకూడదో చూపిస్తుంది. మంచి విజన్ వున్న దర్శకుడు జయశంకర్” అని నిర్మాత శేషు చెప్పారు. ‘ఈ సినిమాలో మంచి కామెడీ వుందని, మళ్ళీ మళ్ళీ చూసే విధంగా దీనిని తీశామని, అనూప్ రూబెన్స్ రావడంతో ఇది బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం కలిగింద’ని మరో నిర్మాత శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్, ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు, చమ్మక్ చంద్ర, అనూప్ రూబెన్స్, ప్రభాస్ శ్రీను తదితరులు మాట్లాడి తమ అభిప్రాయాన్ని తెలియచేశారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!