Pooja-Hegde : సెట్స్ లో హీరోలకు ఇచ్చినట్టు హీరోయిన్లకు మర్యాదలు, గౌరవాలు ఇవ్వరని హీరోయిన్ పూజాహెగ్డే అన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ.. తెలుగులో తగ్గించేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. హీరోల కంటే హీరోయిన్లు అంటే ఇండస్ట్రీలో చిన్న చూపే ఉంటుంది. హీరోలకు ఇచ్చినంత గౌరవ, మర్యాదలు హీరోయిన్లకు ఇవ్వరు. హీరోలకు సెట్స్ దగ్గరే క్యారవాన్లు ఉంటాయి. కానీ మాకు అలా కాదు. సెట్స్ కు దూరంగా ఎక్కడో ఉంటాయి. అక్కడి వరకు మేం మేకప్ తో పాటు కాస్ట్యూమ్స్ వేసుకుని నడుచుకుంటూ వెళ్లాలి. కొన్ని సార్లు బరువైన బట్టలు వేసుకుని కూడా ఇబ్బంది పడుతూనే నడుచుకుంటూ వెళ్లాలి.
Read Also : Deepika Padukone : దీపిక పదుకొణె చెప్పిన స్టార్ హీరో అతనేనా..?
హీరోలకు ఇచ్చినట్టు పర్సనల్ స్టాఫ్ ను కూడా మాకు సరిగ్గా ఇవ్వరు. హీరోల ఇష్టాలకు, అభిప్రాయాలకు ఉన్నంత ఇంపార్టెన్స్ మాకు ఉండదు. వాళ్లు చెబితే ఎలాంటి మార్పులు అయినా చేస్తారు. కానీ మేం చెబితే ఎవరూ సరిగ్గా పట్టించుకోరు. మమ్మల్ని కేవలం గ్లామర్ర వరకే పరిమితం చేస్తుంటారు చాలా మంది. అది కొన్ని సార్లు ఇబ్బందిగా అనిపించినా.. సినిమా మీద ఉన్న ప్రేమతో చేస్తుంటాం. కానీ ఇలాంటి తేడాలు కనిపించినప్పుడే మాకు చాలా బాధేస్తుంది అంటూ తెలిపింది పూజాహెగ్డే. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పూజా తెలుగులో మంచి హిట్లు కొట్టింది. కానీ ఇప్పుడు పెద్దగా అవకాశాలు రాక ఖాళీగానే ఉంటోంది.
Read Also : Rashmika – Vijay Deverakonda : రష్మిక, విజయ్ ఏంటిది.. పెళ్లి విషయంలోనూ ఎందుకింత సస్పెన్స్..