Rashmika – Vijay Deverakonda : వారం రోజులుగా సోషల్ మీడియాను ఓ వార్త కుదిపేస్తోంది. రష్మిక, విజయ్ దేవరకొండ ఎంగేజ్ మెంట్ జరిగిందని.. ఫిబ్రవరిలో పెళ్లి అంటూ ఒకటే రూమర్లు. సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు ఇదే వైరల్ అవుతోంది. చాలా మంది కన్ఫర్మ్ అన్నట్టే చెప్పేస్తున్నారు. కానీ ఈ జంట మాత్రం సైలెంట్ గా ఉంటుంది. తమకు అసలు ఎంగేజ్ మెంట్ అయిందో లేదో అనే విషయంపై కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. ఎలాంటి ఫొటోలు బయటకు రాకుండానే ఈ వార్తలు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. మరి ఇంత రచ్చ జరుగుతుంటే ఈ జంట కనీసం స్పందించాలి కదా. పెళ్లి విషయంలో ఎందుకు ఇంత సస్పెన్స్ గా ఉంచుతున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు.
Read Also : Neha Shetty : సన్న నడుము అందాలతో చెమటలు పట్టిస్తున్న నేహాశెట్టి
కనీసం తమ అభిమానుల కోసమైనా.. నిజంగా ఎంగేజ్ మెంట్ జరిగిందో లేదో చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉండటం ఏంటి.. అంటే ఫ్యాన్స్ విషయంలో కనీసం ఆ మాత్రం బాధ్యత కూడా వీరికి లేదా అని ఏకిపారేస్తున్నారు. ఇన్ని రోజులు ప్రేమ విషయంలో ఎలాగూ సస్పెన్స్ మెయింటేన్ చేశారు. మరి ఇంత ముఖ్యమైన పెళ్లి విషయంలో ఎందుకు ఇంత సీక్రెట్. వీళ్లు స్పందించికపోయేసరికి అసలు నిజంగా ఎంగేజ్ మెంట్ జరిగిందా లేదా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. రకరకాల రూమర్లు వస్తున్నాయి. ఇంత రచ్చ జరుగుతుంటే ఒక్క క్లారిటీ ఇవ్వడానికి వీళ్లకు ఏం పోయింది అంటున్నారు సామాన్య ప్రేక్షకులు.
Read Also : Manchu Lakshmi : మంచు లక్ష్మీకి ఫిల్మ్ జర్నలిస్టు మూర్తి క్షమాపణలు..