Pooja Hegde : అందుకే.. పవన్‌కి ‘నో’ విజయ్‌తో ‘సై’..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హ్యాట్రిక్ ఫ్లాప్స్ వచ్చినా.. పూజా హెగ్డే క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా భారీగా రెమ్యూనరేషన్‌గా పెంచేసి.. క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. అలాంటి ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి తప్పుకుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకు ఎన్నో కారణాలు కూడా వినిపిస్తున్నాయి.. తాజాగా ఇప్పుడు పవన్ సినిమా వదులుకోవడానికి ఇదే అసలు కారణమని తెలుస్తోంది. మరి పూజా పవన్‌ని నిజంగానే రిజెక్ట్ చేసిందా..!
Also Read
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో పూజాకు భారీ డిమాండ్ ఉంది. రాదే శ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు ఫ్లాప్‌గా నిలిచినా.. స్టార్ హీరోలకు ఈ ముద్దుగుమ్మే ఫస్ట్ ఛాయిస్‌గా మారిపోయింది. దాంతో అమ్మడు భారీగానే డిమాండ్ చేస్తోంది. మేకర్స్ కూడా పూజా అడిగినంత ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో.. ‘జనగణమన’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘జెజీఎమ్’ పేరుతో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కోసం పూజా దాదాపు 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాకు నో చెప్పిందనే ప్రచారం మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్లో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా రాబోతోంది. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డేని ఎంపిక చేసినట్టు వార్తలొచ్చాయి. కానీ రీసెంట్‌గా ఎందుకో ఈ సినిమా నుంచి అమ్మడు తప్పుకుందని వినిపించింది. దాంతో అసలు కారణం ఏంటని ఆరా తీయగా.. JGM చిత్రానికి భారీ పారితోషికం అందడంతో.. పవన్ ప్రాజెక్ట్ కూడా వదులుకుందని తెలుస్తోంది. పైగా పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తారు.. ‘భవదీయుడు’ సినిమాని ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకొస్తారనే విషయంలో క్లారిటీ రావడం లేదు. అందుకే పవన్‌కి నో చెప్పి.. విజయ్‌తో సై అందని టాక్. అయితే నిజంగానే పూజా.. పవన్ సినిమాను వదులుకుందా.. లేదా.. అనే విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఇకపోతే.. రీసెంట్‌గా ఎఫ్ 3 స్పెషల్ సాంగ్‌లో చిందేసిన పూజా.. ప్రస్తుతం ‘సర్కస్’.. ‘కభీ ఈద్ కభీ దివాలి’ అనే హిందీ సినిమాల్లో నటిస్తోంది.
తాజావార్తలు
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!