Pooja Hegde: బుట్టబొమ్మను స్టార్ హీరోకు చెల్లెలిని చేసేశారే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక హీరోయిన్ ఏ పాత్ర ఇచ్చిన చేయగలగాలి.. ఇలాంటి పాత్రలే చేస్తాను అని కూర్చుంటే.. అవకాశాలు అందుకోవడం కష్టం. నాటి తరం నాయికలు ఒకే హీరోకు చెల్లిగా చేశారు.. హీరోయిన్ గా చేశారు. అన్నాచెలెల్లిగా కన్నీళ్లు తెప్పించారు.. ప్రేమికులుగా రొమాన్స్ పండించారు. ఎలాంటి పాటలోనైనా ఒదిగిపోవడం హీరోయిన్ కు ఉండాల్సిన ప్రధాన లక్షణం.. ప్రస్తుతం బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా అలాంటి హీరోయిన్లలో ఒకరు.. హీరోయిన్ గా ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బుట్టబొమ్మ స్పెషల్ సాంగ్స్ లలో కూడా కనిపిస్తూ మెప్పిస్తోంది. ఇప్పటికే రంగస్థలంలో తన సత్తా చాటిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎఫ్ 3 లో వెంకటేష్, వరుణ్ లతో కలిసి చిందేస్తోంది.
ఇక ఇక్కడి వరకు బాగానే ఉన్నా వెంకటేష్, రానా ప్రధాన పాత్రలుగా నెట్ ఫ్లిక్స్ కోసం `రానా నాయుడు` పేరుతో ఒక వెబ్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతున్న విషయం విదితమే. ఇక ఈ సిరీస్ లో కూడా పూజా హీరోయిన్ గా నటిస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇటీవలే బయటికి వచ్చేసింది. ఇక తాజాగా ఈ సిరీస్ గురించిన ఒకవార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సిరీస్ లో పూజా, వెంకటేష్ కు చెల్లిగా నటించనున్నదట. సినిమాలో వీరిద్దరి మధ్య వున్న అనుబంధం, వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్స్ గా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. ఎఫ్ 3 లో స్పెషల్ సాంగ్ లో వెంకీ మామ తో రొమాంటిక్ గా డాన్స్ వేసిన పూజా.. రానా నాయుడు లో చెల్లెలిగా కనిపించడం విశేషం. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే డిసెంబర్ 30 వరకు ఆగాల్సిందే.
Also Read
- Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్డేట్.. 'బొమ్మరిల్లు' డైరెక్టర్‌తో కొత్త కాంబో?
- Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
- Akshay Kumar: ఆ హీరోయిన్ నా మొదటి క్రష్.. క్లైమాక్స్ లేకుండానే సినిమా.. అక్షయ్ షాకింగ్ రివీల్
- South Indian Women-Led Films : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన లేడి ఓరియేంటేడ్ సౌత్ మూవీస్
తాజావార్తలు
-
Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్డేట్.. ‘బొమ్మరిల్లు’ డైరెక్టర్‌తో కొత్త కాంబో?
-
Vivo Y05e: వివో Y05e విడుదల.. 5150mAh బ్యాటరీ, Unisoc T606 చిప్‌తో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
-
Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
ట్రెండింగ్
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?