Trivikram: బ్రో.. టీజర్ రిలీజ్ అయ్యింది. పవన్ వింటేజ్ లుక్స్ అదిరిపోయింది.. పవన్ -తేజ్ కామెడీ టైమింగ్ పీక్స్.. థమన్ మ్యూజిక్.. సముతిరఖని షాట్స్ అదరగొట్టేశాడు. కానీ, ఈ టీజర్ గురించి, పవన్ గురించి, కామెడీ గురించి కన్నా మరొక దాని గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.. అదేంటంటే బ్రో టీజర్ లో పూజా హెగ్డే ఉంది అని.. ఏంటి కామెడీనా అంటే.. నిజమండీ బాబు. టీజర్ లో పూజా హెగ్డే ఉంది. ఇంకా చెప్పాలంటే.. పూజా పోస్టర్ తోనే టీజర్ మొదలవుతుంది. ఇప్పుడు ఆ పోస్టర్ నే అభిమానులు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. టీజర్ లో పూజా ఎక్కడుంది అబ్బా.. అని ఆలోచిస్తున్నారా.. టీజర్ మొదలుకాకముందే.. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాడ్ వస్తుంది కదా.. అందులో ఉంది. ఆ యాడ్ తరువాతనే టీజర్ మొదలు అవుతుంది. దీంతో పూజాను కూడా టీజర్ లో కలిపేశారు ఫ్యాన్స్.
Apsara Rani: బికినీ లో బోర్ కొట్టి.. బట్టలు కట్టుకున్నావా.. డెవిల్ పాప
త్రివిక్రమ్.. పూజాను యాడ్ చేయడానికే టీజర్ ను లేట్ చేశాడని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో పెట్టడానికే గుంటూరు కారం నుంచి తీసేసావా త్రివిక్రమ్ అంటూ ఆడేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే టాపిక్ నడుస్తోంది. పూజా లేకుండా త్రివిక్రమ్ సినిమాలు తీయడు అని చెప్పుకొస్తున్నారు. ఆమె త్రివిక్రమ్ లక్కీ హీరోయిన్ అని, ఆమె ఉంటే సినిమా హిట్ గ్యారెంటీ అని.. ఇలా అయినా పూజా కనిపించింది కాబట్టి బ్రో కూడా హిట్ అందుకుంటుందని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అందుకుంటుందో చూడాలి.