Site icon NTV Telugu

Ponniyin Selvan: మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్.. వచ్చేది అప్పుడేనట..

ponniyin selvan

ponniyin selvan

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘పొన్నియన్ సెల్వన్’. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ ని ప్రకటించింది. పలు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 30 న రిలీజ్ కానున్నట్లు తెలిపారు. ఈ రిలీజ్ డేట్ తో పాటు విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు. యుద్ధ వీరులుగా జయం రవి, విక్రమ్ కనిపించగా కార్తీ డిఫరెంట్ లుక్ లో కనిపించి మెప్పించాడు. ఇక త్రిష, ఐశ్వర్య రాయ్ యువరాణులుగా కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్స్ నెట్టింట వైరల్ గా మారింది. తమిళ్ తో పాటు హిందీ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాతో మణిరత్నం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

Exit mobile version