Ponniyin Selvan 1 Trailer Released: దర్శకుడు మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే! చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిషా వంటి భారీ తారాగణంతో ఈ సినిమా రూపొందుతోంది. కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా ఈ చారిత్రాత్మక చిత్రం తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 30వ తేదీన ఈ సినిమా తొలి భాగం విడుదలకు ముస్తాబవుతున్న తరుణంలో.. చిత్రబృందం ఒక్కో అప్డేట్ రిలీజ్ చేస్తూ, చిత్రంపై ఆసక్తి పెంచుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల అయ్యింది. 3:23 నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్.. ఒక విజువల్ వండర్‌లా సాగింది.
రానా వాయిస్ ఓవర్‌తో మొదలయ్యే ట్రైలర్.. రాజ్యాధికారం కోసం జరిగే పోరాటం నేపథ్యంలో సినిమా రూపొందినట్టు తెలుస్తోంది. ఒక హిస్టారియల్ సినిమాలో ఏవైతే ఉండాలో.. ఆ పోరాట ఘట్టాలు, కుట్రలు – కుతంత్రాలు, భారీతనం, వీరోచితమైన పోరాట ఘట్టాలన్నీ ఈ చిత్రంలో ఉండనున్నట్టు ట్రైలర్ చూశాక స్పష్టమవుతోంది. ఇందులో ఎమోషనల్ డ్రామాను కూడా మణిరత్నం బాగా దట్టించినట్టు అర్థమవుతోంది. ఏఆర్ రెహ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ కూడా అదిరింది. అయితే.. ట్రైలర్ మొత్తంలో విజువల్స్ మాత్రం అదిరాయి. వీఎఫ్ఎక్స్ వర్క్‌పై మేకర్స్ బాగా కసరత్తు చేసినట్టు కనిపిస్తోంది. ఎక్కడా వంక పెట్టడానికి లేకుండా, అద్భుతమైన గ్రాఫిక్స్‌ని అందించారు. చూస్తుంటే, ఈ సినిమాలో విజువల్స్ హైలైట్‌గా నిలవనున్నట్టు తెలుస్తోంది.
బాహుబలి సినిమాని ఢీ కొట్టాలని ఇప్పటికే కొందరు దర్శకులు ప్రయత్నాలు చేశారు. కానీ, ఎవ్వరూ దాని దరిదాపుల్లోకి వెళ్లేదు. మరి, విజువల్ గ్రాండియర్‌గా తెరకెక్కుతోన్న ఈ పొన్నియిన్ సెల్వన్.. బాహుబలిని దాటుతుందా? ఆ సినిమాలాగే ఇది ఆకట్టుకుంటుందా? ఇది పాన్ ఇండియా సినిమానే అయినా, ఆ స్థాయి బజ్ అయితే ఈ చిత్రంపై నెలకొనలేదు. చూద్దాం.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో?