యంగ్ టైగర్ ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల పేర్లు గత 48 గంటలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. గంటకో ట్రెండింగ్ టాపిక్ వచ్చే రోజుల్లో రెండు రోజులుగా ట్విట్టర్ లో ఈ ఇద్దరి పేర్లు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. ట్విట్టర్ టాప్ 4 ట్రెండ్స్ లో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ల పేర్లు, ఈ ఇద్దరి హీరోల సినిమా పేర్లు తప్ప ఇంకో మ్యాటరే లేదు. ఎన్టీఆర్, కొరటాల దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ 30’ సినిమాచేస్తున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మే 19 సాయంత్రం 7 గంటలకి రిలీజ్ చెయ్యనున్నారు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కాబట్టి సెలబ్రేషన్స్ ని ఒక రోజు ముందు మొదలుపెడుతూ ‘ఎన్టీఆర్ 30’ మేకర్స్ ఫస్ట్ లుక్ ని ఒకరోజు ముందే రిలీజ్ చేస్తున్నారు. దీంతో గత రెండు రోజుల్లో రెండు ప్రీలుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేసి ఎన్టీఆర్ ఫాన్స్ కి ఖుషి చేస్తున్నారు.
ఇక ఈరోజు సాయంత్రం ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా బయటకి వచ్చేస్తే సోషల్ మీడియా షేక్ అవ్వడం గ్యారెంటీ. ఎన్టీఆర్ ఫాన్స్ సంగతి ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఇంకా అరాచకంగా ఉన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్ప్స్ నుంచి మొదలు పెడితే OG సెకండ్ షెడ్యూల్ అప్డేట్, ఇప్పుడు ‘బ్రో’ టైటిల్ అనౌన్స్మెంట్ వరకూ పవన్ నటిస్తున్న ప్రతి సినిమా నుంచి ఫాన్స్ కి అప్డేట్స్ అందాయి. ఈ నెలంతా పవన్ ఫాన్స్ కి దర్శక నిర్మాతలు కిక్ ఇస్తూనే ఉన్నారు. ఈ కారణంగా పవన్ ఫాన్స్ సోషల్ మీడియాలో పవన్ పేరుని టాప్ ట్రెండ్ చేస్తున్నారు. #NTR30 #Devara #BROTheAvatar #PawanKalyan ట్రెండ్ అవుతున్న టాగ్స్ లో టాప్ 4లో ఉన్నాయి. మే 20 ఎన్టీఆర్ బర్త్ డే కాబట్టి నెక్స్ట్ 24 గంటలు ఎన్టీఆర్ ఫాన్స్ మరింత యాక్టివ్ గా మారి ట్విట్టర్ ని షేక్ చెయ్యడం గ్యారెంటీ.