Pindam Trailer: భయపెడుతున్న ‘పిండం – ది స్కేరియస్ట్ ఫిల్మ్’ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా తెలుగులో అసలుసిసలైన హారర్ చిత్రం రాబోతోంది. అదే ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. పిండం ట్రైలర్ గురువారం ఉదయం 11:45 గంటలకు విడుదలైంది. 3 నిమిషాల 45 సెకన్ల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈశ్వరీ రావుతో “మరణం అనేది నిజంగానే అంతమా?. మరణించిన తరువాత ఏం జరుగుతుంది అనేది ఎవరైనా చెప్పగలరా?. కోరికలు తీరని వారి ఆత్మలు ఈ భూమ్మీద నిలిచిపోతాయా?. ఆ ఆత్మలు మనకు నిజంగానే హని చేయగలవా?” అంటూ నిజ జీవితంలో కూడా ఎందరో తెలుసుకోవాలనుకునే ఆసక్తికర విషయాలను అవసరాల శ్రీనివాస్ అడగడంతో ట్రైలర్ ప్రారంభమైంది. చాలా కాలంగా ఎవరూ నివసించని ఒక ఇంటిలోకి కథానాయకుడు శ్రీరామ్ కుటుంబం వస్తుంది. ఆ ఇంట్లో వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆత్మ ఆ కుటుంబానికి నిద్ర కూడా లేకుండా, ప్రాణ భయంతో వణికిపోయేలా చేస్తుంది. అలాంటి సమయంలో వారికి సాయం చేయడానికి వచ్చిన ఈశ్వరీ రావు “మీ కుటుంబాన్ని వేధిస్తున్నది ఒక్క ఆత్మ కాదు” అని చెప్పడం మరింత ఉత్కంఠగా మారింది.
Also Read
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
- Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఆ ఆత్మల కథ ఏంటి? వాటి నుంచి శ్రీరామ్ కుటుంబాన్ని ఈశ్వరీ రావు రక్షించిందా? అనే ప్రశ్నలను రేకెత్తిస్తూ ట్రైలర్ నడిచింది. ఇక ప్రారంభంలో అవసరాల శ్రీనివాస్ అడిగిన ప్రశ్నలకు సమాధానం అన్నట్లుగా “ఒక వస్తువుని తగలబెట్టినా, నరికినా, పూడ్చినా అది అంతమైపోతుందని మనం భ్రమపడతాం. కానీ ఆ వస్తువులోని అంతర్గత శక్తిని, ఆ ఎనర్జీని మనం ఎప్పటికీ నిర్మూలించలేం. ఇది శాశ్వత సత్యం.” అని ఈశ్వరీ రావు చెప్పిన మాటతో ట్రైలర్ ను ముగించిన తీరు ఆకట్టుకుంది. ట్రైలర్ లో కెమెరా పనితనం కానీ, నేపథ్య సంగీతం కానీ హారర్ చిత్రానికి తగ్గట్టుగా అద్భుతంగా కుదిరాయి. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే థియేటర్ లో ప్రేక్షకులు అసలైన హారర్ అనుభూతిని పొందడం ఖాయమనిపిస్తోంది. ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ‘పిండం‘ అనేది కంప్లీట్ హారర్ చిత్రంగా ఉండబోతుంది. ఇది యదార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ అని, ఇంతటి భయానక హారర్ చిత్రాన్ని టాలీవుడ్ ఇంతవరకూ చూడలేదని చిత్ర బృందం చెబుతోంది. పిండం కథ ప్రస్తుతం అలాగే 1990 మరియు 1930 లలో.. ఇలా మూడు కాలక్రమాలలో జరుగుతుంది. స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుంది.
తాజావార్తలు
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!