Pindam OTT Streaming Update: గత ఏడాది రిలీజ్ అయిన హారర్ సినిమాలలో పిండం సినిమా కూడా ఒకటి. ఒకప్పటి శ్రీ రామ్, ఖుషి రవి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో ఈశ్వరి రావు, అవసరాల శ్రీనివాస్ వంటి వారు ఇతర పాత్రల్లో నటించారు. స్కేరియెస్ట్ ఫిలిమ్ ఆఫ్ ది ఇయర్ గా మేకర్స్ ప్రచారం చేసిన ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన అందుకుంది. అయితే భయపెట్టడంలో మాత్రం సినిమా ప్రచారకర్తలు ప్రచారం చేసినట్టుగానే నాలుగు అడుగులు ముందే ఉంది ఈ సినిమా. అయితే సినిమా రిలీజ్ అయ్యి దాదాపు నెల రోజులు కావస్తున్న నేపథ్యంలో సినిమా ఓటీటీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఇక ఈ సినిమాని ఆహా వీడియో ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేసేందుకు మేకర్లు సిద్ధమయ్యారు.
Operation Valentine: కార్గిల్ వార్లో పాల్గొన్న వింగ్ కమాండర్ ను కలిసిన వరుణ్ తేజ్
ఇక ఈ అంశానికి సంబంధించి ఆహా వీడియో ఒక పోస్టర్ రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే ఈ సినిమా ఆహా వీడియోలో రాబోతోంది అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఎప్పుడు స్ట్రీమ్ అవుతుందనే విషయం మీద మాత్రం అధికారికంగా ప్రకటన చేయలేదు. పీరియాడిక్ హారర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా సైలెంట్ కిల్లర్ లాగా పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే జనాల్లోకి వచ్చి మంచి టాక్ సంపాదించింది. ముఖ్యంగా సినిమా ఎండింగ్ లో సెకండ్ పార్ట్ కోసం లీడ్ ఇవ్వడం మరింత ఆసక్తికరంగా మారింది అయితే సెకండ్ పార్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ మేకర్స్ మాత్రం ఒక్క సారిగా ఆ లీడ్ ఇచ్చి ఆసక్తి పెంచేసే ప్రయత్నం చేశారు.
Keep guessing👻🐦⬛
Coming soon on aha… pic.twitter.com/rDg57y7NUn— ahavideoin (@ahavideoIN) January 25, 2024