Varun Tej met Kargil war Wing Commander Myneni srinath: వరుణ్ తేజ్ గత కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడ్డా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సోనీ పిక్చర్స్ తో కలిసి సందీప్ ముద్ద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మానుషీ చిల్లర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకి మీకీజే మేయర్ సంగీతం అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా మొదటి పాట వందేమాతరం ఈ మధ్యనే ఇండియా పాకిస్తాన్ బోర్డర్ వాఘాలో రిలీజ్ చేశారు.
Oori Peru Bhairavakona: పోటీ నుంచి తప్పుకుంటాం కానీ మాకూ సోలో రిలీజ్ డేట్ కావాలి!
ఇక రిలీజ్ అయిన ఈ పాటకి మంచి అప్లాజ్ వచ్చింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ పాత్రలో నటిస్తున్నాడు. మానుషీ చిల్లర్ కూడా అదే పాత్రలో నటిస్తోంది. అయితే తాజాగా వరుణ్ తేజ్ కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన ఒక వింగ్ కమాండర్ తో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మైనేని శ్రీనాథ్ అనే వ్యక్తి కార్గిల్ వార్ లో వింగ్ కమాండర్ గా పాల్గొన్నారు. ఈ రోజు మర్యాదపూర్వకంగా వరుణ్ తేజ్ ఆయనతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో బయటకు వచ్చి, వెంటనే అది వైరల్ అవుతుంది. ఈ సినిమాని ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు మేకర్స్. వరుణ్ తేజ్ కి ఒక రకంగా చెప్పాలంటే ఇది మొట్టమొదటి హిందీ డెబ్యూ సినిమా కాబోతోంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నార్త్ లో కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్.