హీరో శ్రీకాంత్ హథనాయుడు రోషన్ హీరోగా, శ్రీలీలా హీరోయిన్ గా “పెళ్లి సందD” అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మహేష్ బాబు విడుదల చేశారు. “ట్రైలర్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రాఘవేంద్రరావు గారికి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు!” అంటూ ట్రైలర్ ను విడుదల చేశారు మహేష్. ఇక ట్రైలర్ లో పెళ్లి సందడి బాగుంది. కామెడీతో పాటు యాక్షన్, ఎమోషన్స్ తో ట్రైలర్ ను కట్ చేశారు. ఇక దీనికి స్పోర్ట్స్ నేపథ్యాన్ని జోడించినట్టు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్ ను చూస్తుంటే రోషన్ కెరీర్ ను కూడా మలుపు తిప్పేలాగా కన్పిస్తోంది.
Read Also : మెగాస్టార్ చేతుల మీదుగా “రిపబ్లిక్” ట్రైలర్
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ‘పెళ్లి సందD’ తెరకెక్కుతోంది. అంతేకాదు ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను కొత్త దర్శకురాలు గౌరి రోనక్ చిత్రీకరించనున్నారు. ఇక ‘పెళ్లి సందడి’కి అద్భుతమైన సంగీతం అందించిన కీరవాణి ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా 1996లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్ళి సందడి’ చిత్రం శ్రీకాంత్ కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.