Pelleppudu Movie set to Release on October 6th: ఈ రోజుల్లో పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న సర్వ సాధారణం అయిపోయింది. పెళ్లి కాన్సెప్ట్ తో ఈ మధ్య అనేక సినిమాలు రాగా ఇప్పుడు అదే పేరుతో మరో సినిమా తెర మీదకు వచ్చింది. తాజాగా శ్రీ సాయి సై౦దవి క్రియేషన్స్ బ్యానర్ మీద సీనియర్ నటి రమాప్రభ, వినయ్ ప్రసాద్ , అరవింద్ సహా పలువురు కీలక పాత్రలలో నటించిన ‘పెళ్లెప్పుడు’ సినిమా ట్రైలర్ ను ఫిలిం ఛాంబర్ లో రిలీజ్ చేశారు. అక్టోబర్ 6న విడుదల అవుతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా నిర్మాత పాండురంగారావు మాట్లాడుతూ మా ‘పెళ్లెప్పుడు’ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అని, సినిమా బాగా వచ్చిందని అన్నారు.
Bigg Boss 7:నా ప్రాపర్టీ అంటావా… మళ్లీ ప్రశాంత్ పై రెచ్చిపోయిన రతిక
గణేష్ మా సినిమా చూసి రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 6న విడుదల చేస్తున్నారని వెల్లడించారు. ఈ సినిమా డైరెక్టర్ ఏ.ఇరదయ రాజ్ మాట్లాడుతూ ఈ సినిమా కథ మొత్తం యూత్ కోసమే తీయడం జరిగిందని, యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని అన్నారు. అక్టోబర్ 6న ఈ సినిమాను విడుదల చేస్తున్నామని, చూసిన మీ అందరికి మా సినిమా నచ్చుతుందని తెలిపారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ “కన్నడ నుండి వచ్చిన “కాంతార” సినిమా ఎలా హిట్ అయిందో ఈ పెళ్లెప్పుడు సినిమా కూడా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. ఇక ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెళ్లి గురించి ఎలాంటి పాయింట్ డిస్కస్ చేశారు అనేది ఆసక్తికరంగా మారింది.