Rathika Rose strong warning to Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పటికే మూడు వారాలు కంప్లీట్ చేసుకుని తాజాగా నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. గతవారం నామినేషన్ల ప్రక్రియ చప్పగా సాగగా నాగార్జున సైతం అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని క్లాస్ పీకారు. దీంతో ఈ వారం నామినేషన్ల ప్రక్రియ హీట్ ఎక్కించేలా ఉందని అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 కు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా ఇక ఆ ప్రోమో గమనిస్తే ముందుగా పల్లవి ప్రశాంత్… గౌతమ్ ను నామినేట్ చేస్తూ శోభా శెట్టితో గొడవ పడినప్పుడు గౌతమ్ షర్ట్ విప్పి తిరగడం నచ్చలేదని చెప్పుకొచ్చాడు. దానికి గౌతమ్ రతిక వన్ పీస్ డ్రెస్ వేసుకుని వచ్చినప్పుడు ఏంటి ఈ పొట్టి పొట్టి బట్టలు అన్నావా లేదా అని గుర్తు చేశాడు.
Colours Swathi: విడాకులయ్యాయో లేదో చెప్పాలన్న రిపోర్టర్.. షాకిచ్చిన కలర్స్ స్వాతి
నేను ఆమెకు దొస్తానాలో చెప్పినా… అంటూ పల్లవి ప్రశాంత్ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తే అసలు నేను ఎట్లా బట్టలు వేసుకుంటే నీకెందుకు అని రతిక అంటుంది. దానికి ప్రశాంత్ నా దగ్గరకు వచ్చి ఇట్లా ఇట్లా ఎందుకు అన్నావ్ అని అడిగితే దానికి రెచ్చిపోయిన రతిక… నోటికి ఏది వస్తే అది వాడకు అని అంటూనే నా ప్రాపర్టీ అనే వర్డ్ ఎట్లా యూజ్ చేస్తావ్ అని రతిక ఫైర్ అవుతున్నట్టు కనిపిస్తోంది. మజాక్ లో అన్న అని ఆయన ఆటే మజాక్ లో ఎట్లా అంటావ్ అని రతిక ప్రశాంత్ పై విరుచుకుపడుతున్నట్టు కనిపిస్తోంది. మొత్తం మీద ఈరోజు ఎపిసోడ్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండేలా కనిపిస్తోంది.