PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవైటేడ్ ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాసేలా ఉంది. గత కొద్ది రోజులుగా బాక్సాఫీస్ దగ్గర పెద్ద చిత్రాలు లేని లోటుని పెద్ది తీర్చేలా ఉంది. అనుకున్నట్టే.. మొదటి రోజు సాలిడ్ స్టార్ట్ అందుకుంది పెద్ది. తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. ‘పెద్ది’ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 135.36 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ‘బాక్సాఫీస్ ఛాంపియన్’గా నిలిచింది.
రామ్ చరణ్ మాస్ క్రేజ్, బుచ్చిబాబు టేకింగ్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ప్రేక్షకులను థియేటర్ల వైపు పరుగులు పెట్టించడంతో తొలిరోజు ఈ స్థాయి వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ ఛాంపియన్ – పెద్ది.. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 135.36 కోట్లకు పైగా గ్రాస్” రాబట్టిందంటూ.. మేకర్స్ అఫీషియల్ పోస్టర్ విడుదల చేశారు. దీంతో రామ్ చరణ్ కెరీర్లో మరో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా పెద్ది నిలిచింది. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి మొదటి రోజు వసూళ్లలో వంద కోట్ల క్లబ్లో ఎంటర్ అయిన చెర్రీ.. ఆ తర్వాత గేమ్ ఛేంజర్ నిరాశ పరిచినా ఇప్పుడు పెద్దితో భారీ వసూళ్లు రాబట్టి చరణ్ క్రేజ్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. మొదటి రోజే ఈ రేంజ్ కలెక్షన్ల రావడంతో పెద్దిగాడి ఆటకు లాంగ్ రన్లో మరిన్ని ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఏదేమైనా.. పెద్దిగాడు బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా ఉన్నాడు.
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- JanaNayagan : విజయ్ 'జననాయగన్'.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
- Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
- Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్‌బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..