Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ అండ్ బిజీయెస్ట్ సెలబ్రిటీలలో మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్ టాప్ ప్లేస్ లో ఉంటాడు. ప్రస్తుతం జీవి చేతిలో గంపెడు సినిమాలు ఉన్నాయి. ఒకవైపు క్రేజీ ప్రాజెక్టులకు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తూ, మరోవైపు నటుడిగా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ కోలీవుడ్, టాలీవుడ్ లలో ఫుల్ బిజీగా ఉన్నాడు జీవీ.
జీవీ ప్రకాష్ కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ టాప్ స్టార్స్ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. వాటిలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ఇరుముడి ఇటీవల రిలీజ్ అయినా గ్లిమ్స్ కు మంచి బిజియమ్ ఇచ్చాడు. ఇక కోలీవుడ్ స్టార్ సూర్య, యాక్షన్ కింగ్ విశాల్ ల రాబోయే సినిమాలకు కూడా జీవీనే సంగీతం అందిస్తున్నాడు. అనిరుధ్ త్వరగా ఇవ్వడు, తమన్ తెలుగులో ఫుల్ బిజీ కావడంతో అగ్ర దర్శకులు, అగ్ర హీరోల ఫస్ట్ ఛాయిస్ గా జీవీ ప్రకాష్ దూసుకుపోతున్నారు. సంగీత దర్శకుడిగా ఇంత బిజీగా ఉంటూనే జీవీ ప్రకాష్ హీరోగా కూడా వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. నటుడిగా జీవీ డైరీ ప్రస్తుతం పూర్తిగా నిండిపోయింది. ఉదయం రికార్డింగ్ థియేటర్ లో కంపోజింగ్ లో ఉంటే మధ్యాహ్నం సినిమా సెట్స్ లో కెమెరా ముందుకు వచ్చి నటిస్తూ 24/7 బిజీగా గడుపుతున్నారు. సాధారణంగా ఒకే రంగంలో రాణించడం కష్టంగా భావించే ఈ రోజుల్లో సంగీతం, నటన అనే రెండు భిన్నమైన విభాగాల్లో జీవీ ప్రకాష్ చూపిస్తున్న మల్టీ టాస్కింగ్ ప్రతిభ నిజంగా అభినందనీయం. టైమ్ మేనేజ్మెంట్ లో జీవీ ప్రకాష్ రూటే వేరు. ఇంత క్రేజీ ప్రాజెక్టులను బ్యాలెన్స్ చేస్తూ ఏ ఒక్కదానికీ ఆలస్యం కాకుండా వర్క్ పూర్తి చేయడం చూస్తుంటే ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు కూడా జీవీ ప్రకాష్ ని చూసి నేర్చుకోవాల్సిందే అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Tilak Varma: “నువ్వు అస్సలు తగ్గొద్దు”.. శ్రీలంకతో ఫైనల్ ఫైట్‌కు ముందు వైభవ్‌కు తిలక్ ఫుల్ సపోర్ట్..
-
Chittoor: ‘ఆమె లేక నేను లేను’.. ప్రేమించిన అమ్మాయి సమాధి వద్దే ప్రియుడి ఆత్మహత్య..
-
Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
-
RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లదా?
-
Nurse Transfer Request: మంత్రి కాళ్లపై పడి కన్నీరు పెట్టుకున్న నర్సు.. కారణం ఏంటంటే?
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!