Payal Rajput Sensational Comments: నటి పాయల్ రాజ్‌పుత్ RX 100 అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా మొదటి సినిమా హిట్ అయినంతగా హిట్లు అందుకోలేక పోయింది. వెంకటేష్, రవితేజ లాంటి హీరోలతో నటించినా హీరోయిన్ గా మాత్రం ఆమెకు మాత్రం పెద్దగా మైలేజ్ రాలేదు. ఈ నేపథ్యంలో ఈ పంజాబీ హీరోయిన్ తన ఐదేళ్ల కెరీర్‌లో సినీ పరిశ్రమలో తనకున్న అనుభవాల గురించి చెబుతూ ఇండస్ట్రీ జనాల పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఆమె కీలక పాత్రలో నటించిన మాయాపేటిక సినిమా రిలీజ్ అయిన క్రమంలో ఆమె ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఇక ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాయల్ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో తనను కొందరు తప్పుదోవ పట్టించారని అన్నారు. ‘‘ఆర్‌ఎక్స్ 100 సక్సెస్ తర్వాత నేను హైదరాబాద్‌లో ఒంటరిగా ఉన్నాను, అలా ఉండడాన్ని అయితే కొంత మంది సద్వినియోగం చేసుకున్నారు.
Sandeep Madhav: సందీప్ మాధవ్ హీరోగా భారీ యాక్షన్ థ్రిల్లర్…
వారు మార్గనిర్దేశం చేసే వంకతో నాకు దగ్గరయ్యారు, కొందరు దర్శకులు నన్ను తప్పుదోవ పట్టించి వాడుకున్నారు” అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సంఘటనల తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పాయల్ పేర్కొంది. ఎలాంటి కథలు చేయాలనేది ఆలోచించిన తర్వాతే సినిమాలకు సైన్ చేస్తున్నానని చెప్పింది. వెంకీ మామలో తనతో కలిసి పనిచేసిన విక్టరీ వెంకటేష్ చాలా మంచి వ్యక్తి అని, ఆయనతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందని, మళ్లీ ఆయనతో కలిసి పని చేయడానికి ఇష్టపడతానని వివరించింది. “ఈ ఇండస్ట్రీలో మనం టాప్ పొజిషన్‌కి వెళ్తాం, అలాగే అట్టడుగున పడిపోతాం. కానీ ఇలాంటివన్నీ మనం భరించాలి, నెగిటివిటీ వదిలి పాజిటివిటీతో ముందుకు సాగాలని పాయల్ అన్నారు. ఇక ఇటీవలే పాయల్ రాజ్‌పుత్ ఆర్‌ఎక్స్ 100తో తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశం ఇచ్చిన అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మంగళవారం’ అనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేసింది.