Payal Rajput : టాలీవుడ్‌ను విమర్శిస్తారా? రాధికా ఆప్టే కామెంట్స్‌పై పాయల్ రాజ్‌పుత్ కౌంటర్!

Payal Rajput

Payal Rajput

టాలీవుడ్ పరిశ్రమపై నటి రాధికా ఆప్టే చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో పెను దుమారం రేపుతున్నాయి. ఈ వివాదంపై తాజాగా బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ తీవ్ర స్థాయిలో స్పందించింది. టాలీవుడ్‌ను విమర్శించే వారిపై తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. తాను గర్వించదగిన తెలుగు నటిని అని పాయల్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. ఒకప్పుడు ఏ ఇండస్ట్రీ అయితే మీకు పేరు, ప్రఖ్యాతులు ఇచ్చిందో.. ఏళ్ల తర్వాత అదే ఇండస్ట్రీ నుంచి అన్నీ తీసుకుని ఇప్పుడు తప్పుగా మాట్లాడటం ఏమాత్రం ధైర్యం అనిపించుకోదని, అది కేవలం కృతఘ్నత మాత్రమే అవుతుందని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడింది.

మీ కెరీర్‌ను ప్రారంభించి, మీకు లైఫ్ ఇచ్చిన మొత్తం టాలీవుడ్ ఎకోసిస్టమ్‌ను ఏళ్ల తర్వాత నిందించడం సరికాదని పాయల్ చురకలంటించింది. “ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం టాలీవుడ్ మాత్రమే, నాకు అండగా నిలబడిన ఈ తెలుగు చిత్ర పరిశ్రమకు నేను ఎప్పటికీ అండగా నిలబడతాను” అని పాయల్ గర్వంగా ప్రకటించింది. తనకు లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీని ఎవరైనా పల్లెత్తు మాట అన్నా సహించేది లేదంటూ పాయల్ రాజ్‌పుత్ చేసిన ఈ సెన్సేషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలుగు చిత్ర పరిశ్రమపై ఆమె చూపించిన ఈ అభిమానానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.