Mayapetika: సెప్టెంబర్ 15 నుంచి ‘మాయా పేటిక’… ఆహాలో స్ట్రీమింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ఓటీటీ ఆహాలో ఈ సెప్టెంబర్ 15న ‘మాయా పేటిక’ స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీ అయ్యింది. రమేష్ రాపర్తి డైరెక్ట్ చేసిన ఈ సినిమా రొటీన్ కథాంశాలకు భిన్నంగా తెరకెక్కింది. ‘మాయా పేటిక’ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్, సునీల్, పృథ్వీరాజ్, శ్రీనివాస్ రెడ్డి, హిమజ, శ్యామల తదితరులు నటించారు. మంచి కథనం, నటీనటుల పెర్ఫామెన్స్, విభిన్నంగా సాగే కథనం ఆడియెన్స్‌కు ఓ సరికొత్త అనుభూతినిస్తుంది. ఓ నిర్మాత టాలీవుడ్ స్టార్ పాయల్ (పాయల్ రాజ్‌పుత్)కి ఖరీదైన స్మార్ట్ ఫోన్‌ను బహుమతిగా ఇస్తాడు. ఆ స్మార్ట్ ఫోన్ చుట్టూ తిరిగే కథతో సినిమా తెరకెక్కింది. ఆ ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్స్‌ను గమనించిన పాయల్ తనకు తెలియకుండానే ఫోన్‌తో అనుబంధాన్ని ఏర్పరుచుకుంటుంది. అయితే అనుకోని సమస్య రావటంతో ఆ ఫోన్‌ని తన అసిస్టెంట్‌కు ఇచ్చేస్తుంది. అక్కడి నుంచి స్మార్ట్ ఫోన్ తన సాహసయాత్రను కొనసాగించటం మొదలు పెడుతుంది.
ఒక్కొక్కరి చేతులు మారుతూ వివిధ ప్రాంతాల్లోని వ్యక్తుల చేతుల్లోకి అది చేరుతుంది. ఆ ఫోన్‌ను సొంతం చేసుకున్న ప్రతీ వ్యక్తి అనిర్వచనీయన అనుభూతికి లోనవుతాడు. అయితే ఈ ఫోన్ ఒక సాధనమే కదా, మరి ఇది మన చేతుల్లో ఉండటం అనేది వరమా? శాపమా? అనే ప్రశ్నను లేవనెత్తుతుంది. ‘మాయా పేటిక’అనేది స్మార్ట్ ఫోన్ గురించి, దానితో ముడిపడిన యజమానుల గురించిన ఆకట్టుకునే ఘటనలను, హాస్యభరితమైన పరిస్థితులను మనకు పరిచయం చేస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్, సర్‌ప్రైజింగ్ చేస్తూనే స్మార్ట్ ఫోన్ అందరి మధ్య తెలియని ఓ బంధాన్ని ఏర్పరుస్తుంది. వ్యక్తులను ఒకచోటికి తీసుకురావటమే కాదు.. వారి మధ్య బంధాలను గురించి కూడా ఆలోచింపచేసేలా చేస్తుంది. అందరి జీవితాల్లో మనకు తెలియకుండానే ఓ మాయాజాలాన్ని ఏర్పరిచిన స్మార్ట్ ఫోన్ అందరినీ మంత్ర ముగ్దులను చేస్తుంది. ఆ ప్రపంచాన్ని సెప్టెంబర్ 15న ఆహాలో మాయా పేటిక చిత్రం ద్వారా వీక్షించటానికి సిద్ధంగా ఉండండి.
Also Read
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!