PawanKalyanOnAHA: ఒప్పేసుకున్నాం.. మీరు ఫ్యాన్స్ కాదు ఆయన భక్తులే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PawanKalyanOnAHA: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది.. అని పవన్ అభిమానులు ఓ పాట పాడేసుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు మొట్ట మొదటిసారి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన విషయం తెల్సిందే. ఎప్పుడో షూటింగ్ జరుపుకున్న ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు స్ట్రీమ్ అవుతుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసారు అభిమానులు. ఇక ఆ శుభ ముహూర్తం వచ్చేసింది. కొద్దిసేపటి క్రితమే ఆహాలో పవర్ స్ట్రోమ్ వచ్చింది. ప్రభాస్ ఎపిసోడ్ లా యాప్ క్రాష్ కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో అభిమానులందరూ ప్రశాంతంగా ఎపిసోడ్ ను వీక్షిస్తున్నారు. ఇక పవన్ నవ్వులు, బాలయ్య జోకులు.. అభిమానుల కేరింతలు ఒక్కటని ఏం చెప్పాలి.. పవన్ ఫ్యాన్స్ అయితే పండుగ చేసేసుకుంటున్నారు.
అసలు పవన్ పేరు వినిపిస్తేనే వారు ఊగిపోతారు.. అలాంటింది.. మొట్ట మొదటిసారి ఓటిటీలో దర్శనమిస్తుంటే ఆగుతారో.. సోషల్ మీడియాలో ట్రెండ్ చేసి పడేశారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా పవన్ నామధేయంతో సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ మారుమ్రోగిపోతున్నాయి. ఇక ఈ అభిమానం ఎక్కడి వరకు వచ్చిందంటే.. ఓటిటీలో ఇప్పటివరకు ఎవరు క్రియేట్ చేయని రికార్డును పవన్ ఫ్యాన్స్ క్రియేట్ చేశారు. 5 నిమిషాల్లో హయ్యెస్ట్ యాప్ లాంచెస్ ను అచీవ్ చేసేశారు. ఇప్పటివరకు ఈ రికార్డును బద్దలు కొట్టింది లేదు. దీంతో ఒప్పేసుకున్నాం.. మీరు ఫ్యాన్క్స్ కాదు ఆయనకు భక్తులే అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ముందు ముందు ఇంకెలాంటి రికార్డ్స్ ను పవన్ ఫ్యాన్స్ బద్దలు కొడతారో చూడాలి.
Also Read
- Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' ట్రైలర్ చూశారా!
- 72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
- Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
- Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!