Pawan Kalyan: ఎప్పుడప్పుడు తెల్లవారుతుందా..? అని కాచుకు కూర్చున్నారు పవన్ అభిమానులు. ఎందుకు అంత ఎదురుచూపు అంటే.. రేపే కదా పవన్- బాలయ్య ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యేది. మొట్ట మొదటిసారి పవన్ కళ్యాణ్.. టాక్ షో కు రావడమే గొప్ప విషయం అనుకుంటే.. అందులో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కు రావడం విశేషం. ఇప్పటికే ఈ ఎపిసోడ్ ప్రోమోలను రిలీజ్ చేసి ఆహా మరింత ఆసక్తిని పెంచేస్తోంది. స్పెషల్ ప్రోమో అని ఒకటి.. మెయిన్ ప్రోమో అని ఇంకొకటి.. ఎపిసోడ్ మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక తాజాగా మరో స్పెషల్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈప్రోమోలో బాలయ్య- పవన్ ల మధ్య సాగిన సరదా సంభాషణ ఎపిసోడ్ మొత్తం ఎలా ఉండబోతుందో చూపించింది. మొదటి నుంచి కూడా బాలయ్య మాట తీరు.. ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. మొన్నటికి మొన్న ఇంట్రోవర్ట్ అయిన ప్రభాస్ తోనేముచ్చట్లు పెట్టించి, ఆటలాడించాడు. ఇక ఇప్పుడు పవన్ సైతం ఆట ఆడుకున్నాడు.
Mytri Movie Mekars: మరో ‘వార్’ కన్ఫామ్ రా.. ఫిక్స్ చేసేసుకోండి
తమ్ముడు సినిమాలో నువ్వే చేసినవన్నీ డూప్ అంటకదమ్మా.. అని అడగడం.. అందుకు పవన్ గట్టిగా నవ్వుతూ.. ట్రూత్.. ఫాల్స్ బోర్డు ను అటుఇటు తిప్పి ఫాల్స్ అని చెప్పాలని ఉంది.. “నిజంగా ఒక స్తంభాన్ని కొట్టాలి. కొట్టేస్తా ఉన్నాను. కొడుతుంటే చేతి నిండా రక్తం వచ్చేస్తూ ఉంది.. షాట్ అయిపోయాక అడిగాను.. ఎవడ్రా.. ఆర్ట్ డైరెక్టర్ ఎవడు దీనికి.. రమ్మని చెప్పండి” అని పవన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. తమ్ముడు సినిమా పవన్ కు ఎంత మంచి హిట్ ను ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి కూడా పవన్ కు సాహసాలు చేయడం కొత్త కాదు.. అది తెలిసి కూడా పవన్ ను డూప్ అనేశావేంటి బాలయ్య అంటూ పవన్ ఫ్యాన్స్ కొద్దిగా నొచ్చుకుంటున్నారు. అయితే అది సరదాగా అన్నదే కానీ సీరియస్ కాకపోవడంతో అభిమానులు సైతం ఓకే అంటున్నారు. మరి రేపు ఇలాంటి జోకులు ఎన్ని ఉంటాయో ఈ ఎపిసోడ్ లో చూడాల్సిందే.