Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్నాడు. ఆయన రీసెంట్ గా నటించిన ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రూ.250 కోట్లకు పైగా వసూలు చేసింది. చాలా కాలం తర్వాత హిట్ పడటంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక దీని తర్వాత పవన్ ఓ క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. రీసెంట్ నిర్మాత దిల్ రాజుకు పవన్ కల్యాణ్ డేట్స్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. దానిపై దిల్ రాజు స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ తో మరో సినిమా చేయాలని చూస్తున్నామని.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే లేట్ అన్నాడు.
read also : Rakul Preet : కత్తిలాంటి అందాలతో రకుల్ రచ్చ..
దీంతో దిల్ రాజు ఏ డైరెక్టర్ ను దించుతాడా అని అంతా ఆలోచిస్తున్నారు. కచ్చితంగా అనిల్ రావిపూడితోనే సినిమా ఉంటుందనే ప్రచారం మొదలైంది. అనిల్ దిల్ రాజు సంస్థలోనే ఎప్పటి నుంచో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం చిరంజీవితో సినిమా అయిపోగానే పవన్ తో సినిమా మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. భగవంత్ కేసరి లాంటి కథతోనే అనిల్ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనిల్ హిట్ డైరెక్టర్ కావడంతో అతనితో సినిమా చేసేందుకు పవన్ కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పే అవకాశాలు లేవు. అందుకే ఈ కాంబినేషన్ ను దిల్ రాజు సెట్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
read also : Samantha : కొత్త ఇంట్లో అడుగు పెట్టిన సమంత.. పూజలు