Pawan Kalyan: బ్రో.. మళ్లీ ఇంకో రీమేకా.. అది కూడా ఆ డైరెక్టర్ తో.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఒకపక్క ప్రచారాలు చేస్తూనే.. ఇంకోపక్క షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఇక ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్.. ఇందులో ఉస్తాద్ రీమేక్. ఇప్పటికే పవన్ చాలా రీమేక్స్ చేశాడు. అవన్నీ పవన్ ఫ్యాన్స్ గా చేసినవారే తప్ప.. అంతగా హిట్ అందుకున్న సినిమాలు ఏమి లేవు. ఈ మధ్య రిలీజ్ అయిన బ్రో కూడా.. కేవలం పవన్ ఫ్యాన్స్ వలనే ఓ మోస్తరుగా ఆడింది. అయినా మొదటినుంచి పవన్ ఫ్యాన్స్.. రీమేక్స్ వద్దు అంటూనే వస్తున్నారు. కానీ, పవన్ కు కథలు వినేంత సమయం లేక, రిస్క్ చేయలేక హిట్ సినిమాలను రేంక్ చేస్తున్నాడు అనేది ఇండస్ట్రీ మాట. ఇక రీమేక్స్ చేసి.. రీమేక్ కింగ్ గా ఎక్కడ పవన్ పేరు తెచ్చుకుంటాడో అని అభిమానుల భయం.బ్రో తోనే రీమేక్స్ కు ఫుల్ స్టాప్ పెడితే బావుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.
Allu Arjun: నేషనల్ క్రష్ హర్టవ్వుద్దని అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు ఇచ్చేశారా?
Also Read
- Hero Sanjosh: కమెడియన్ రామచంద్రకు హీరో సంజోష్ ఆర్థిక సాయం.. ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్తా అని హామీ!
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
ఇక ఆ కోరిక ఇప్పుడే నెరవేరేలా లేదని టాక్ నడుస్తోంది. అవును .. అందుతున్న సమాచారం ప్రకారం పవన్ మరో రీమేక్ కు సై అన్నాడని టాక్ నడుస్తోంది. ఈ మూడు సినిమాలు కాకుండా పవన్.. సురేందర్ రెడ్డితో ఒక సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోను మేకర్స్ అధికారికంగా కూడా అనౌన్స్ చేశారు. ఇక ఈ మధ్యనే ఏజెంట్ సినిమాతో సురేందర్ రెడ్డి భారీ పరాజయాన్ని అందుకున్నాడు. అయినా కూడా పవన్ ఇచ్చినమాట కోసం.. సురేందర్ రెడ్డితో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇక సురేందర్ రెడ్డి కూడా ఒక హిట్ సినిమా రీమేక్ ను ప్లాన్ చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. దీంతో అభిమానులు.. నిరాశను వ్యక్తం చేస్తున్నారు. బ్రో.. మళ్లీ ఇంకో రీమేకా.. అది కూడా ఆ డైరెక్టర్ తో.. ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో చూడాలి.
తాజావార్తలు
-
YS Jagan: చంద్రబాబు రక్తచరిత్ర రాస్తున్నారు.. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది!
-
CEC Appointment: గతంలో తప్పు చేశాం.. సీఈసీ నియామకంలో మార్పులు రావాలి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
-
General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక..
-
Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్!
-
Kolkata Stampede: భారీ వర్షం.. పండాల్ కూలుతుందన్న ప్రకటన.. కోల్‌కతా తొక్కిసలాటపై పోలీసుల వివరణ..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!