Pawan Kalyan – Ram Charan – Bunny : మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య గ్యాప్ వచ్చిందనే వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మరీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ ఏ స్థాయిలో జరుగుతుందో చూస్తున్నాం. వీటన్నింటికీ చెక్ పెట్టే ఫ్రేమ్ ఇది. పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. చాలా ఏళ్ల తర్వాత వీరు ముగ్గురూ ఇలా కనిపించారు. అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ రీసెంట్ గా చనిపోయిన విషయం తెలిసిందే. నేడు ఆమె పెద్ద కర్మను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ మొత్తం తరలి వెళ్లింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, నాగబాబు వెళ్లారు.
Read Also : Pawan Kalyan : అల్లు అర్జున్ ఇంట్లో పవన్ కల్యాణ్, అకీరా..!
ఈ సందర్భంగా పవన్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకే సోఫాలో కూర్చుని మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ముగ్గురినీ ఒకే ఫ్రేమ్ లో చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఈ దెబ్బతో ఫ్యాన్ వార్ ఆగిపోతుందని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అటు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. అల్లు అరవింద్ ఫ్యామిలీ వచ్చిన వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తోంది. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరవుతున్నారు. చాలా కాలం తర్వాత ఇలా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కలిసి ఒకే దగ్గర కనిపించాయి.
Read Also : Bigg Boss 9 : మరీ ఓవర్ చేసిన మాస్క్ మ్యాన్ హరీష్.. ఇంత అవసరమా..?
