పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ చిత్రం “ఓజీ” . యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా, సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడంతో, అభిమానుల్లో ఉత్కంఠ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక సినిమా ప్రమోషన్లో భాగంగా, ఈ నెల సెప్టెంబర్ 19న విజయవాడ, 21న హైదరాబాద్ లో రెండు భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లు నిర్వహించనున్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా హైదరాబాద్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశముందని టాక్.. ఇదిలా ఉంటే తాజాగా ట్రైలర్ డేట్ కూడా లాక్ అయ్యిందని స్ట్రాంగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి.
Also Read : Taapsee Pannu : బక్కచిక్కిపోయిన తాప్సీ లుక్ వైరల్ – హెల్త్‌పై ఫ్యాన్స్ టెన్షన్
సమాచారం ప్రకారం, “ఓజీ” ట్రైలర్ సెప్టెంబర్ 15న విడుదల కానుందట. అయితే, అధికారిక క్లారిటీ మేకర్స్ నుంచి ఇంకా అందాల్సి ఉంది. సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్టైలిష్ యాక్షన్, థమన్ సంగీతం, అద్భుతమైన కథా అంశాలు కలిపి ఈ సినిమా భారీ సెన్సేషన్ సృష్టిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఫ్యాన్స్ ఇప్పటికే ట్రైలర్ కోసం వేచి ఉన్నందున,మరి సెప్టెంబర్ 15న వస్తుందా? వచ్చిన ట్రైలర్ ఈ సినిమా ఉత్సాహాన్ని మరింత పెంచుతుందా? వేచి చూడాల్సిందే.