ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ‘ఓజి’ పై భారీ అంచనాలున్నాయి. అనౌన్స్మెంట్‌తోనే హైప్‌ని పీక్స్‌కు తీసుకెళ్లారు డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు. ముంబైలో షూటింగ్ స్టార్ట్ చేయడమే లేట్ అన్నట్టుగా.. జెట్ స్పీడ్‌లో 50 పర్సెంట్ షూటింగ్ పూర్తి చేశారు. ఇక మేకర్స్ ఇచ్చే అప్డేట్స్, పోస్టర్స్ పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాయి. ఖచ్చితంగా.. ఒక పవర్ స్టార్ అభిమానిగా యంగ్ డైరెక్టర్ సుజీత్, తమ హీరోని ఒరిజినల్ గ్యాంగ్ స్టర్‌గా ఓ రేంజ్‌లో చూపించబోతున్నాడని.. ఇప్పటి నుంచి ఎలివేషన్ లెక్కలు వేసుకుంటున్నారు. మేకర్స్ ఇచ్చిన హైప్ కూడా అదే రేంజ్‌లో ఉండడంతో.. వీలైనంత త్వరగా ఈ సినిమా థియేటర్లోకి వస్తే బాగుంటుందని అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఈ ఏడాది డిసెంబర్‌లోనే ఓజి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని.. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఓజి షూటింగ్‌కు బ్రేక్ పడనుందని తెలుస్తోంది. ఇటీవలె మొదటి విడత వారాహి యాత్రను కంప్లీట్ చేశారు పవర్ స్టార్.
ఇక ఇప్పుడు మళ్లీ వారాహి యాత్రపై ఫోకస్ చేశాయడంతో.. ఓజికి బ్రేక్ తప్పదంటున్నారు. అయితే వారాహి యాత్రకు ముందు ఓజిని పరుగులు పెట్టించారు పవన కళ్యాణ్. ఇప్పటికే తనకి సంబందించిన మెజారిటీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇదే జోష్‌లో ఓజి పూర్తి చేస్తారని అనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఇప్పట్లో ఓజీ సినిమాకి పవన్ డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి ఉందని లేటెస్ట్ టాక్. అందుకే సుజీత్.. పవన్ లేని సీక్వెన్స్‌ని ఫినిష్ చేసే పనిలో ఉన్నారట. పవన్ పార్ట్‌ను వదిలేసి.. నెక్స్ట్ షెడ్యూల్‌ని జులై రెండో వారంలో మొదలు పెట్టబోతున్నారట. ఒకవేళ పవన్ డేట్స్ ఇస్తే మాత్రం.. ఓజి అనుకున్న సమయానికే కంప్లీట్ అవనుందని చెప్పొచ్చు.