Pawan Kalyan Donates one Crore Amid AP Floods: ఆంధ్రప్రదేశ్లో వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు వరదలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే విజయవాడ లాంటి చోట్ల చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ప్రభుత్వ యంత్రాంగం, లోకల్ లీడర్లు వారికి సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు.
Nivin Pauly: షాకింగ్: ప్రేమమ్ హీరో మీద రేప్ కేసు??
ప్రస్తుతం రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయంలో ఆయన వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిలను పరిశీలిస్తున్నారు. రాష్ట్ర హోమ్, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియాతో పాటు అందుబాటులో ఉన్న ఇతర ముఖ్య ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో వరద బీభత్సానికి చాలా మంది ప్రాణాలు కోల్పోగా వేల మంది ఆశ్రయాన్ని కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపద్యంలో ఎన్నారైలు, ఉద్యోగులు ముఖ్యమంత్రి సహాయనిధికి తమకు తోచినంత సాయం చేస్తున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమ నుంచి కూడా దాదాపుగా మూడు కోట్లకు పైగా విరాళాలు ఇప్పటికే ప్రకటించారు