HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ జులై 24న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నాడు పవన్ కల్యాణ్. తాజాగా మంగళగిరిలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ఈ సినిమాలో ఔరంగజేబు లాంటి క్రూరత్వాన్ని తట్టుకుని ఒక హిందూ ధర్మకర్త ఎలా పోరాడాడు అనేది చూపించాం. హిందువుగా బతకాలంటే శిస్తు కట్టాలి అన్నప్పుడే తిరగబడటమే మన ముందున్న న్యాయం అన్నది ఇందులో ధర్మం. నేను డిప్యూటీ సీఎంగా ఉండి సినిమాలు చేయలేకపోతున్నా. అందుకే రాజకీయాలకే నా మొదటి ప్రాధాన్యాత. తర్వాతనే సినిమాలు. ఇక మీదట నటించడం కుదరకపోవచ్చు. గతంలో ఏ సినిమాలకు ప్రమోషన్ చేయలేదు. కానీ ఇది నాకు చాలా స్పెషల్. అందుకే చేస్తున్నా అని చెప్పారు పవన్.
Read Also : HHVM : నా సినిమాను ఎవరూ బాయ్ కాట్ చేయలేరు.. పవన్ ఫైర్..
అందరికీ పెంచినట్టే ఈ సినిమాకు రేట్లు పెంచారు. ఈ మూవీ విషయంలో చాలా ఇబ్బందులు వచ్చాయి. వాటన్నింటినీ తట్టుకుని నిలబడ్డాం. ఈ మూవీని నా ఎమ్మెల్యేలు, మంత్రులకు స్పెషల్ షో వేసి చూపిస్తాను. జానీ సినిమాను నేను తీసినప్పుడు ప్లాప్ వచ్చింది. వెంటనే నిర్మాతలను, బయ్యర్లను పిలిచి అందరికీ సెటిల్ చేశాను. ఆ సినిమా ఫలితంతో కొన్ని రోజులు నిశ్శబ్దంగా ఉండిపోయా. తర్వాత నన్ను నేను తట్టుకుని నిలబడటం ఆ మూవీతో నేర్చుకున్నా. జానీ మూవీ ఫలితంతో వచ్చిన ధైర్యమే నన్ను రాజకీయాల్లో నిలబెట్టింది. ఈ మూవీకి రెండో పార్టు కూడా ఉంది. ఇప్పటికే 20 శాతం సినిమా పూర్తి అయింది అంటూ తెలిపారు పవన్ కల్యాణ్.
HHVM : Pawan Kalyan : బిగ్ న్యూస్.. ఇక నిర్మాతగా మారనున్న పవన్ కల్యాణ్..