టాలీవుడ్ లో ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.. మహేష్ నటించిన పోకిరి సినిమా తో మొదలైంది ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతుంది.రీ రిలీజ్ లో పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘ఖుషి’ చిత్రం కొత్త ట్రెండ్ సృష్టించింది. ఈ సినిమాకు మొదటి రోజు భారీ గా కలెక్షన్స్ వచ్చాయి.. భారీ హైప్ తో విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమా కూడా ఈ సినిమా రికార్డ్స్ ను క్రాస్ చేయలేకపోయింది.ఇక ఈ చిత్రం రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా నే వస్తుంది.పవన్ కళ్యాణ్ ను స్టార్ హీరో ని చేసిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ తొలిప్రేమ చిత్రం ఈ నెల 30 వ తేదీన విడుదల కు రెడీ అయింది.
ఈ చిత్రాన్ని శ్రీమాత క్రియేషన్స్ కొనుగోలు చేసిన్నట్లు సమాచారం. ఈ చిత్రం ప్రింట్ ను 4K కి రీ మాస్టర్ చేయించి ఈ నెల 30 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు సమాచారం.అయితే ఈ సినిమా కి వచ్చే వసూళ్లు జనసేన పార్టీ కి విరాళంగా ఇస్తాము అంటేనే పవన్ కళ్యాణ్ ఏ సినిమా రీ రిలీజ్ ని అయినా ప్రోత్సహించండి అంటూ సోషల్ మీడియా లో ఒక ప్రకటన అయితే వచ్చింది..అయితే శ్రీమాత క్రియేషన్స్ వారు మేము ఈ చిత్రం రైట్స్ ని కొనుగోలు చేసి చాలా కాలం అయితే అయ్యింది.గతం లో ఈ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకున్నారు.ఈసారి మాత్రం ఎవరు చెప్పిన కూడా మేము వినదల్చుకోలేదు అంటూ ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది శ్రీమాతక్రియేషన్స్,త్వరలోనే హైదరాబాద్ లో ఒక గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఏర్పాటు చేసి అక్కడే ట్రైలర్ ని కూడా విడుదల చేయబోతున్నారని సమాచారం.ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా రికార్డ్స్ ను క్రాస్ చేస్తుందో లేదో చూడాలి.