పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్… మెగా మామా అల్లుళ్లు మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. ది అవతార్ అనే టాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా నటిస్తుండగా, సాయి ధరమ్ తేజ్ ‘మార్క్’గా కనిపించనున్నాడు. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ రెండు పోస్టర్స్ ని మించి… పవన్-సాయి ధరమ్ తేజ్ లని కలిపి ఒకే దగ్గర చూపిస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ ని లాంచ్ చేసారు. ఈ పోస్టర్ మెగా అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది. పవన్ ఒక స్టైలిష్ బైక్ పైన ఒక కాలు పెట్టి ‘శ్రీకృష్ణుడి’లా ముందు నిలబడగా, అతని వెనుక చేతులు కట్టుకోని ‘అర్జుని’డిలా సాయి ధరమ్ తేజ్ నిలబడి ఉన్నారు. ఈ పోస్టర్ డిజైన్ ఇంప్రెస్ చేసింది.
మామా అల్లుళ్లు పక్కపక్కన నిలబడి ఫాన్స్ కి మంచి కిక్ ఇచ్చారు కానీ పోస్టర్ లో ఒక్కటే తేడా కొడుతుంది. పవన్ కళ్యాణ్ వేసుకున్న షూస్ లో ఒకటి వైట్ కలర్ లో, ఇంకొకటి బ్లాక్ కలర్ లో ఉన్నాయి. ఇది ఏదైనా డిజైనా లేక షాడో ఎఫెక్ట్ వలన వైట్ షూ బ్లాక్ కలర్ లో కనిపిస్తుందా అనేది పోస్టర్ ని డిజైన్ చేసిన వారికే తెలియాలి. ఈ షూ కలర్ వరకూ వదిలేస్తే మిగిలిన పోస్టర్ మాత్రం కేక అనే చెప్పాలి. సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ ‘బ్రో’ కొత్త పోస్టర్ ని ట్రెండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మధ్య మ్యాజిక్ వర్కౌట్ అయితే జులై 28న థియేటర్స్ లో మెగా ఫాన్స్ రచ్చ చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
Here's the 1st Peek at #BroTheAvatar Combo that'll set the screens ablaze on July 28th 🤙🔥 #BROTheDuo 💥@PawanKalyan & @IamSaiDharamTej 🤩@thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @bkrsatish @TheKetikaSharma@NavinNooli @ZeeStudios_ @zeestudiossouth… pic.twitter.com/B2bwd8rPQo
— People Media Factory (@peoplemediafcy) May 29, 2023