పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, గబ్బర్ సింగ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ హరీష్ శంకర్ ఈ మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ ‘తెరి’కి రీమేక్ అనే రూమర్ వినిపిస్తోంది కానీ అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. షూటింగ్ స్టార్ట్ అవ్వగానే పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా ‘శ్రీలీలా’ నటిస్తోందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం యూత్ లో శ్రీలీలకి సూపర్ ఫాలోయింగ్ ఉంది. ధమాకా సినిమాతో శ్రీలీలా క్రేజ్ అమాంతం పెరిగింది. క్యూట్ గా కనిపిస్తూనే గ్లామర్ గా కూడా కనిపించగల శ్రీలీల, పవన్ కళ్యాణ్ పక్కన నటించడం ఉస్తాద్ సినిమాకి హలో అయ్యే విషయమే.
శ్రీలీలా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో నటిస్తుందనే విషయం తెలియగానే పవన్ ఫాన్స్ అంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఒక ఫ్యాన్ మాత్రం “ఎదో ఒక సాంగ్ లో శ్రీలీల, పవన్ కళ్యాణ్ తో ఒక మాస్ స్టెప్ ప్లాన్ చెయ్ హరీష్ అన్నా” అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కి ఓకే అన్నట్లు హరీష్ శంకర్ ట్వీట్ చెయ్యడంతో ఫాన్స్ ఫుల్ జోష్ లోకి వచ్చారు. ఎందుకంటే శ్రీలీలా ఎలాంటి డాన్సర్ అనేది ధమాకా సినిమాలో అందరూ చూసిన వాళ్లే. హైవోల్టేజ్ వైర్ లా డాన్స్ వేసే శ్రీలీలాకి స్వాగ్ తోనే స్క్రీన్ ని కబ్జా చేసే పవన్ కళ్యాణ్ కూడా కలిస్తే తెరపై సూపర్బ్ సాంగ్ ని చూసే అవకాశం దొరుకుతుంది. మరి ఏ సాంగ్ లో పవన్ కళ్యాణ్, శ్రీలీల కలిసి మాస్ డాన్స్ చేస్తారనేది చూడాలి.
— Harish Shankar .S (@harish2you) April 14, 2023