Patriotic Telugu Movies : ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ వరకు… ‘దేశభక్తి’ టాలీవుడ్ హీరోల కొత్త ఆయుధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Patriotic Telugu Movies : టాలీవుడ్లో ప్రేమకథలు, మాస్ యాక్షన్ సినిమాలు, పాన్ ఇండియా ఫాంటసీ చిత్రాలు గతంలో ట్రెండ్ సెట్ చేశాయి. అయితే ఇప్పుడు తెలుగు సినిమా మరో కొత్త దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. దేశభక్తి, గూఢచారి ఆపరేషన్లు, యుద్ధ నేపథ్యాల వంటి అంశాలు రాబోయే భారీ బడ్జెట్ చిత్రాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర హీరోలు వరుసగా దేశభక్తి కథలను ఎంచుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ ఈ ట్రెండ్‌కు పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది. విప్లవం, యుద్ధం, ప్రేమ, త్యాగం వంటి అంశాల కలయికతో రూపొందుతున్న ఈ చిత్రం కమర్షియల్ సినిమా కంటే భిన్నంగా ఉండబోతోందని సమాచారం. దేశం కోసం పోరాడే ఒక వ్యక్తి జీవితాన్ని ప్రేమకథతో ముడిపెట్టి చూపించే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి.
మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ కూడా దేశభక్తి ప్రధాన నేపథ్యంతోనే రూపొందుతోందని దర్శకుడు స్వయంగా వెల్లడించడం మరింత ఆసక్తిని పెంచింది. ప్రశాంత్ నీల్ చెప్పిన వివరాల ప్రకారం ఇది కేవలం యాక్షన్ సినిమా కాదు. దేశం కోసం జరిగే రహస్య పోరాటాల చుట్టూ తిరిగే హై ఇంటెన్స్ కథ. రా ఆపరేషన్లు, గూఢచారి వ్యవస్థ, దేశ భద్రతకు సంబంధించిన అంశాలు ఇందులో కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. నిజ జీవిత సంఘటనల నేపథ్యంలో రావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా మరింత పెరిగాయి. ప్రస్తుతం టాలీవుడ్లో ఈ కొత్త ట్రెండ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో టాలీవుడ్లో దేశభక్తి కథలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ చిత్రాలపైనే ఉంది.
Also Read
- Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
- Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
- Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ 'లవ్ అండ్ వార్' ఫస్ట్ లుక్ రిలీజ్
- Hashmi - Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
- Tags
- cinema
తాజావార్తలు
-
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
-
Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!