కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’ నార్త్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతునే ఉంది. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ మూవీ ఇప్పటివరకూ 507 కోట్లు రాబట్టింది. కేవలం హిందీ బాషలో, నార్త్ లో మాత్రమే రాబట్టిన కలెక్షన్స్ ఇవి. ఈ రేంజ్ కలెక్షన్స్ తో పఠాన్ మూవీ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఫస్ట్ ప్లేస్ లో 511 కోట్లు రాబట్టి మన బాహుబలి 2 సినిమా ఉంది. ఇండియాలో ఒక సినిమాకి ఏ భాషలో అయినా ఇదే అత్యధిక కలెక్షన్స్. దాదాపు ఏడేళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఈ రికార్డుని బ్రేక్ చెయ్యడానికి పఠాన్ రెడీ అవుతున్నాడు. మరో మూడున్నర, నాలుగు కోట్లు రాబడితే చాలు పఠాన్ సినిమా హిందీలో టాప్ గ్రాసర్ అవుతుంది. బాహుబలి 2 సెకండ్ ప్లేస్ లోకి వెళ్లి, పఠాన్ సినిమా ఫస్ట్ ప్లేస్ లోకి వస్తుంది. ఇది జరిగితే పఠాన్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అతి తక్కువ సమయంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా చరిత్ర సృష్టిస్తుంది.
ప్రస్తుతం ఉన్న బాక్సాఫీస్ ట్రెండ్ చేస్తుంటే పఠాన్ సినిమా నెక్స్ట్ మండేకి బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చెయ్యడం గ్యారెంటీ. విడుదలైన నెల రోజుల తర్వాత కూడా ప్రతి రోజు దాదాపు కోటి రూపాయలు రాబడుతున్న పఠాన్ సినిమా ఇప్పటికే స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తుంది. బాలీవుడ్ లో కొత్త సినిమాల రిలీజ్ లు లేకపోవడం, ఆల్రెడీ వచ్చిన సెల్ఫీ సినిమా డిజాస్టర్ అవ్వడం, 110/- కే పఠాన్ టికెట్స్ ఇస్తుండడంతో కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించట్లేదు. బాహుబలి 2 హిందీ కలెక్షన్స్ టార్గెట్ గా రిలీజ్ అయిన పఠాన్ సినిమా ఎట్టకేలకు 40 రోజుల తర్వాత బాహుబలి 2ని బ్రేక్ చేస్తుంది.