2013 తర్వాత హిట్ లేదు, 2018 నుంచి సినిమానే లేదు… ఈ మధ్య వచ్చిన యంగ్ హీరోలు కూడా ఇండస్ట్రీ హిట్స్ ఇస్తున్నారు, ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరు తెచ్చుకున్న అతను మాత్రం సినిమాలే చెయ్యట్లేదు. ఇక అతను పని అయిపొయింది, అవుట్ డేటెడ్ అయిపోయాడు, అతను ఇక ఇండియన్ సూపర్ స్టార్ కాదు… ఇవి పఠాన్ మూవీ రిలీజ్ వరకూ షారుఖ్ ఖాన్ గురించి ఇండియన్ మీడియా రాసిన ఆర్టికల్స్. అంతేనా అయిదేళ్లు సినిమా చెయ్యకపోతే మూడు దశాబ్దాలుగా యునానిమస్ గా టాప్ చైర్ లో కూర్చున్న హీరో పని అయిపోతుందా? అతని చరిత్రని అంత ఈజీగా రైట్ ఆఫ్ చేసేస్తారా? నో వే… షారుఖ్ అనే చాప్టర్ అంత ఈజీగా ముగుసిపోయే కథ కాదు అని నిరూపిస్తూ నెల రోజుల్లో వెయ్యి కోట్లు రాబట్టింది పఠాన్ సినిమా. షారుఖ్ హిట్ కొడితే ఎలా ఉంటుందో నిరూపించిన పఠాన్ సినిమా హిందీ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ ఉన్న ప్రతి రికార్డుని బ్రేక్ చేసి షారుఖ్ ఖాన్ టైం అయిపోలేదు, అది చిన్న గ్యాప్ మాత్రమే ఇకపై అసలు సినిమా చూపిస్తాడు అని యాంటి ఫాన్స్ తో కూడా అనిపించింది పఠాన్ సినిమా.
Read Also:Chandrababu Naidu: పొలిటికల్ రౌడీయిజాన్ని భూస్థాపితం చేస్తా
33 రోజుల పాటు ప్రతి రోజు కోటి రూపాయలని కలెక్ట్ చేసిన పఠాన్ సినిమా, ది మైటీ బాహుబలి 2 హిందీ కలెక్షన్స్ ని కూడా క్రాస్ చేసింది. ఎన్నో సినిమాలు, ఎందరు స్టార్ హీరోలు, భారి బడ్జట్ లు బాహుబలి 2 రికార్డులని బ్రేక్ చెయ్యడానికి ట్రై చేశాయి కానీ ఒక్క సినిమా కూడా బాహుబలి 2 దగ్గరికి కూడా రాలేదు. ఆ భారి రికార్డుని షారుఖ్ ఖాన్ కేవలం నెలన్నర రోజుల్లో బ్రేక్ చేశాడు. బాహుబలి 2 సినిమా హిందీలో 510 కోట్లు రాబడితే పఠాన్ సినిమా 511 కోట్లు(కేవలం హిందీలో) రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దగ్గరలో పెద్ద సినిమాల రిలీజ్ లేదు, ఇప్పటికే రిలీజ్ అయిన కొత్త సినిమాలూ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించట్లేదు. దీంతో పఠాన్ కి మరింత లాంగ్ రన్ దొరికే ఛాన్స్ ఉంది. మరి రికార్డులన్నింటినీ తనపై రాసుకుంటున్న పఠాన్ సినిమా థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యే లోపు ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.