Parakramam: మాంగల్యం డైరెక్టర్ ‘పరాక్రమం’తో వచ్చేస్తున్నాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parakramam Movie Pre Teaser: గతంలో మాంగల్యం, నిర్బంధం, సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బండి సరోజ్ కుమార్ ఇప్పుడు బిఎస్కె మెయిన్ స్ట్రీమ్ పతాకం పై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించబోతున్న మూవీ “పరాక్రమం”. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రెండు షెడ్యూల్స్ లో ముప్పై రోజులో షూటింగ్ పూర్తి చేసి ఫిబ్రవరి 14, 2024 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ప్రీ టీజర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ మీడియా మిత్రులకు, పెద్దలకు నమస్కారాలు, బండి సరోజ్ కుమార్ అనే నేను ఒక నటుడిగా , దర్శకుడిగా మీలో కొంత మందికి తెలిసే ఉండొచ్చని అన్నారు. “కళ నాది. వెల మీద” అనే కాన్సెప్ట్ తో, డిజిటల్ ప్లాట్ ఫారమ్స్ లో రిలీజ్ చేసిన “నిర్బంధం, మాంగల్యం” లాంటి క ల్ట్ సినిమాలో నాకు లక్షలాది ప్రేక్షకుల అభిమానం లభించిందని, వాళ్ళు ఇచ్చిన బలంతో ఇప్పుడు నేను “BSK MAINSTREAM” అనే నా సొంత నిర్మాణ సంస్థ ద్వారా వెండితెరకు రాబోతున్నానని అన్నారు.
Mega 156: ప్రకటనొచ్చేసింది… కానీ అతనికే డైరెక్షన్ ఛాన్స్!
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
పిల్లా , పాపలతో కుటుంబాలు సినిమా హాల్ కు తరలి వచ్చే కథాంశం తో “పరాక్రమం” అనే సినిమాను తెరకెక్కించబోతున్నా I,ME,MYSELF ” దీని టాగ్ లైన్ అని అన్నారు. గోదావరి జిల్లా లో “లంపకలోవ” గ్రామంలో పుట్టిన “లోవరాజు” అనే యువకుడి జీవితంలో జరిగే గల్లీ క్రికెట్, ప్రేమ, నాటక రంగ జీవితం , రాజకీయం లాంటి ఘట్టాల ఆవిష్కరణ ఈ సినిమా ముఖ్య కథాంశం అని యువతను అన్ని విధాలుగా ఎంటర్టైన్ చేస్తూనే, వారిని మేల్కొలిపే ఒక మంచి కమర్షియల్ కథతో రాబోతున్నానని అన్నారు. నాతో పాటు ప్రతిభ ఉన్న నూతన నటీ, నటులను ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేయబోతున్నానని ఆయన అన్నారు. దీనికి రచన, కూర్పు, సంగీతం, దర్శకత్వం నేనే వహిస్తుండగా మిగిలిన విభాగాల్లో ప్రతిభ గల సాంకేతిక నిపుణులతో ఈ చిత్రం నిర్మించబడుతుందని, ఒక గొప్ప సంకల్పంతో నేను నిర్మించబోయే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళాలని ఆయన కోరారు.
తాజావార్తలు
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
ట్రెండింగ్
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..